వైరస్ వచ్చిన వారికి ఈ కారులో ప్రయాణం ఫ్రీ! మానవత్వం చాటుకుంటున్న ఖమ్మం కుర్రాడు!

కరోనా.. అందరిని హడలిస్తున్న పేరు ఇది. దీనికి బయపడి బంధాలను వదులుకున్న వారు చాలా మందే ఉన్నారు. కరోనాతో తల్లి చనిపోతే అంత్యక్రియలు చేయని కొడుకులు ఉన్నారు. నాన్నకి పాజిటివ్ వచ్చినా పట్టించుకుని బిడ్డలు ఉన్నారు. రక్త సంబంధీకులు సైతం అంత్యక్రియలకు దూరంగా ఉండిపోతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాము. కానీ.., ఇలాంటి పరిస్థితిల్లో కూడా ఖమ్మం జిల్లాకి చెందిన ఓ కుర్రాడు తన మంచి హృదయాన్ని చాటుకుంటున్నాడు. కరోనా పాజిటివ్ పేషంట్స్ ని తన సొంత కారులో గమ్య స్థానాలకి చేరుస్తున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు? ఇంత విపత్కర పరిస్థితిల నడుమ కూడా అతను ఎందుకు ఇంతటి దైర్యంగా ప్రజలకి తన వంతు సహాయం చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఖమ్మంకు చెందిన యువకుడు నల్లమళ్ల రంజిత్. ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో ఇతనికి ఓ చిన్న హోటల్ ఉంది. అయితే.., కరోనా సోకిన రోగులు హాస్పిటల్ కు వెళ్లడానికి పడుతున్న ఇబ్బందులను రంజిత్ గమనించారు. అంబులెన్సుల కోసం వేలకు వేల చెల్లించలేక తన ఊరి ప్రజలు పడ్డ బాధ ఆయన్ని కదిలించి వేసింది. దీంతో.., తన కారునే అంబులెన్సుగా మార్చేశారు నల్లమల్ల రంజిత్. అలా కరోనా బాధితులను తన సొంత ఇన్నోవా కారులో ఆస్పత్రులకు చేర్చడం మొదలుపెట్టాడు.

atha 2 1ఆ తరువాత నుండి సీరియస్ గా ఉన్న వారిని ఏకంగా హైదరాబాద్ కు కూడాతన కారులో ఉచితంగానే తీసుకువెళుతున్నాడు రంజిత్. ఇందుకోసం కారులో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాడు రంజిత్. రోగులకు ఆక్సిజన్ పెట్టేందుకు సౌకర్యాలు కల్పించారు. ఒకవేళ హాస్పిటల్ లో ఎవరైనా చనిపోతే వారి బాడీలను కూడా.. తన కారులోనే మృతుడి సొంత ఊర్లకు తీసుకెళ్తున్నాడు రంజిత్. నిజానికి కరోనా పాజిటివ్ అని తేలగానే సొంత కుటుంబ సభ్యులే ముఖం చాటేస్తున్న రోజులివి. ఇలాంటి సమయంలో కోవిడ్ పేషంట్స్ ని తరలిస్తూ ఆపద్బాంధవుడు అయ్యారు నల్లమల రంజిత్. సొంత వాళ్లే దగ్గరికి రాని పరిస్థితుల్లో రంజిత్ చేస్తున్న సేవ అద్బుతమంటూ అతన్ని స్థానికులు కొనియాడుతున్నారు. రంజిత్ సమయానికి హాస్పిటల్ కి తీసుకుని పోవడం వల్లే ఈరోజు మేము బతికున్నాము అని చెప్పే ప్రజలు ఊరిలో చాలా మందే ఉన్నారు. ఇక రంజిత్ చేస్తున్న సేవలను తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ.. అతనికి ఫోన్ చేసి అభినందించడం విశేషం. మరి.., చూశారు కదా? రంజిత్ చేస్తున్న మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.