అషూ రెడ్డి వర్మ చెంపపై కొట్టాక ఆయన రియాక్షన్- పెళ్లి పెటాకులు ప్రోమో-2

ఫిల్మ్ డెస్క్- సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్య ఎలా రెచ్చిపోతున్నారో అందరికి తెలిసిందే. ఆ మధ్య బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తరువాత యాంకర్ అరియానాతో జిమ్‌లో ఇంటర్వ్యూ చేసి అందరిని ఆశ్చర్యపడిచారు. ఈ బోల్డ్ ఇంటర్వ్యూలో పచ్చిగా శృంగారం గురించి మాట్లాడుకుంటూ రచ్చ రచ్చ చేశారు. ఇదిగో మళ్లీ ఇప్పుడు మరో ఇంటర్వూతో మన ముందుకు వస్తున్నారు ఆర్జీవి.

ఈసారి మరో బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేస్తూ సినిమాకి మించిన ప్రమోషన్స్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే ఈ బోల్డ్ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలు, టీజర్లు, ప్రోమోలపై చర్చ జరుగుతోంది. కేవలం అషురెడ్డి తొడలనే ఫోకస్ చేసిన ఆర్జీవీ. ఎదురుగా అషురెడ్డి థైస్ మొత్తం కనిపించే కూర్చుని ఉంటే కింద కెమెరా పెట్టి వివిధ భంగిమల్లో ఫొటోలు రిలీజ్ చేశారు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విషెష్ అందిస్తూ వర్మ, అషు రెడ్డిలు శృంగారం గురించి మాట్లాడుకుంటున్న బోల్డ్ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు.

RGV 1

అషూ రెడ్డితో ఈ బోల్డ్ ఇంటర్వ్యూ ఫస్ట్ ప్రోమోలో. వర్మ ఆమె థైస్ బాగున్నాయని పచ్చిగా చెప్పడం, అషూరెడ్డి వర్మ చెంపపై కొట్టడం జరిగింది. ఇదిగో ఇప్పుడు తాజాగా ఆ సీన్‌ని కంటిన్యూ చేస్తూ సెకండ్ ప్రోమో విడుదల చేశారు రాంగోపాల్ వర్మ. నీ తొడలు బాగున్నాయని వర్మ అనడంతో.. అషు లాగిపెట్టి కొట్టి.. ఓ అమ్మాయి గురించి అలా ఎలా మాట్లాడతావ్ అని వర్మపై కోప్పడింది.

అందుకు రెస్పాండ్ అయిన ఆర్జీవి.. ఇలాగైనా నేను అనుకున్నది జరిగింది, నీ చేతి స్పర్శ నాకు తగిలింది అని అంటాడు. దానికి హో.. అంటూ అషురెడ్డి ఓ రేంజ్‌లో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది. మెల్లిగా చైర్ లోంచి చేలి, కాలు కింద పెట్టిన కెమెరాకు తన థైస్‌ని వివిధ భంగిమల్లో చూపిస్తూ కాస్త ఒయ్యారు పోయింది. ఇక ఈ మొత్తం ఇంటర్వ్యూ ‘పెళ్లి పెటాకులు’ పేరుతో ఈ రోజు సెప్టెంబర్ 7 రాత్రి 6.9 గంటలకు యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు రాంగోపాల్ వర్మ. మరి ఇది ఏ రేంజ్ లో ఉంటుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.