అదిరిపోయిన రజనీకాంత్ అణ్ణాత్త ఫస్ట్ లుక్, తలైవా స్టైల్ కు అంతా ఫిదా

ఫిల్మ్ డెస్క్- తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు అభిమానుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కేవలం భారత దేశంలోనే కాకుండా జపాన్ లాంటి విదేశాల్లోను రజనీ కాంత్ కు ఫ్యాన్స్ ఉన్నారంటే అంతియోశక్తి కాదు. రజనీ కాంత్ స్టైల్, ఆయన మేనరిజం అభిమానుల్ని కట్టిపడేస్తుంది. అందుకే రజనీ సూపర్ స్టార్ అయ్యారు.

ఐతే ఈ మధ్య కాలంలో రజనీ కాంత్ సినిమాలు అంతగా సక్సెస్ సాధించడం లేదు. రజనీకి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చి చాలా కాలమైందనే చెప్పాలి. ఆ మధ్య రాజకీయాల్లోకి కూడా వెళ్లాలనుకున్న రజనీ, చివరికి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుున్నారు. ఇకపై పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు తలైవా. దీంతో కొంత మంది అభిమానులు నిరాశ చెందినా, మెజార్టీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

Annaatthe 1

ఇక రజనీకాంత్ తాజాగా నటిస్తున్న సినిమా ‘అణ్ణాత్త’. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రజనీ లుక్ తాజాగా విడుదల చేసింది అణ్ణాత్త యూనిట్. మాస్ చిత్రాల దర్శకుడిగా పేరుగాంచిన శివ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఇక అణ్ణాత్త సినిమాలో రజనీ కాంత్ సరసన ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ లు నటిస్తుండగా.. ప్రకాష్ రాజ్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న అణ్ణాత్త శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. వినాయక చవితి పండగ నేపధ్యంలో అణ్ణాత్త మూవీ నుంచి రజినీ కాంత్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రజనీ కాంత్ సరికొత్త లుక్ అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.