ఏపీలోని విజయవాడలో జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీ కాంత్.. ఎన్టీఆర్, చంద్రబాబులపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ ప్రసంగంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇది ముదిరి.. వైసీపీ , రజనీ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి తెరలెపింది. ఈ వివాదంపై తాజాగా జగపతి బాబు స్పందించారు.
ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామరావు శతజయంతి వేడుకలకు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరైన సంగతి తెలిసిందే. విజయవాడలో జరిగిన ఈ వేడుకలలో నందమూరి హీరో బాలకృష్ణ రజనీని ఆత్మీయంగా ఆలింగన చేసుకుని స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రజనీ కాంత్.. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలకృష్ణపై పొగడ్తల వర్షం కురిపించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడి నుంచి అసలు కథ మొదలైంది. రజనీకాంత్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రజనీ కాంత్ పై వస్తున్న పొటికల్ కామెంట్స్ పై హీరో జగపతి బాబు స్పందించారు.
ఏపీలోని విజయవాడలో జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న రజనీ కాంత్ చంద్రబాబుపై ప్రశంస వర్షం కురిపించారు. ఇదే అసలు రచ్చకు ప్రధాన కారణమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ ని, బాలకృష్ణను పొగడటం విషయంలో అభ్యతరం చెప్పని వైసీపీ నాయకులు చంద్రబాబు విషయంలోనే ఆభ్యతరం వ్యక్తం చేశారు. చంద్రబాబు పై పొగడంతో కొందరు వైసీపీ నాయకులు, మంత్రులు రజినీకాంత్ పై దారుణంగా విమర్శలు చేశారు. కొందరు అయితే ఆయన స్థాయినే తగ్గించి మరీ కామెంట్స్ చేశారు.
దీంతో రజినీ అభిమానులు వైసీపీ నాయకులపై సీరియస్ అయ్యారు. అసలు ఈ వేడుకలలో రజినీ ఏపీ రాజకీయాలపై మాట్లాడలేదని, ఆ విషయం గమనించకుండా దారుణంగా విమర్శించడమేంటనీ రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ వివాదంపై టాలీవుడ్ నటుడు జగపతి బాబు స్పందించారు. గోపిచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాలో జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో ఆయన పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రమోషన్లో జగపతి బాబుకు రజనీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజనీకాంత్ ప్రసంగించారని మీడియా వాళ్లు అన్నారు.
అలానే ఆయన ప్రసంగంపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటని ఒకరు ప్రశ్నించారు. వారి ప్రశ్నకు జగపతిబాబు స్పందిస్తూ.. తాను ఎక్కువగా టీవీలు చూడనని, అలానే పత్రికలను చదవనని తెలిపారు. ఈ కారణంగా తనకు రజనీ ఏం మాట్లాడారు? ఎవరు విమర్శించారనేది తనకు అవగాహన లేదన్నారు. అయితే రజనీకాంత్ నవ్విస్తూ చక్కగా నిజాలు మాట్లాడతాడని, ఆయనను అనేవాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారని, అవి పట్టించుకోవాల్సిన అవసరం లేదని జగపతి బాబు చెప్పుకొచ్చారు. మరి.. జగపతి బాబుపై వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.