సూపర్ స్టార్ రజనీ రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్న అభిమానులు అనేక మంది ఉన్నారు. అయితే కొన్ని కారణాల దృష్ట్యా రానని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం తనకు లేదని పునరుద్ఘాటిస్తున్నప్పటికీ ఆయనను మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై చర్చకు తావునిచ్చారు రజనీ.
‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా.. నా నుంచి రాజకీయాలు దూరం కాలేదు’ అని ఓ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పారు కానీ.. ఈ డైలాగ్ సరిగ్గా సరిపోయేదీ మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్‌కు. వెండి తెర మీద ఓ వెలుగు వెలిగిన ఆయన.. రాజకీయాల్లోకి రావాలని అభిమానులు ఆశపడుతున్నారు. అయితే రాజకీయాల్లోకి వద్దామని అనుకున్న ప్రతి సారి ఏదోటి వస్తూనే ఉంది. అనూహ్యంగా రాజకీయాల్లోకి రావడం లేదని గత ఏడాది ప్రకటించారు. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాజకీయాల్లోకి రాకపోవడానికి కారణాలు వెల్లడించారు. కిడ్నీ సమస్యతో పాటు కరోనా ప్రభావం కారణంగా తాను రాలేకపోయానని చెప్పారు. అయితే ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వార్తలు మొదలయ్యాయి. దానికి కారణం ఆయన ఓ పార్టీ నేతను కలవడం
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే కుటుంబాన్ని రజనీకాంత్ శనివారం కలిశారు. వారి అధికార నివాసమైన మాతో శ్రీకి వెళ్లారు సూపర్ స్టార్. శివసేన చీఫ్ ఉద్ధవ్‌ను రజనీ కలవడంతో చర్చ మొదలైంది. రాజకీయాల్లోకి వస్తారేమోనన్న వార్తలు మొదలయ్యాయి. అయితే అదేమీ లేదని తెలుస్తోంది. దీనిపై ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన ఒకరు క్లారిటీ ఇచ్చారు. బాంద్రాలోని మాతో శ్రీలో ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రశ్మీ, కొడుకులు ఆదిత్య, తేజస్‌లను రజనీ కలిశారని చెప్పారు. ఇది రాజకీయేతర సమావేశమని స్పష్టం చేశారు. రజనీకి బాల్ థాకరే అంటే ఇష్టమని, ఆయన మద్దుతుదారుడిగా ఉండటంతో మర్యాదపూర్వకంగా వారి కుటుంబ సభ్యులను కలిసేందుకు రజనీ వచ్చినట్లు చెప్పారు.
అయితే రజనీని వారి కుటుంబం ఆయనకు సాదర స్వాగతం పలికింది. వారంతా దిగిన ఫోటోలను మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే ట్విట్టర్‌లో షేర్ చేశారు. మాతో శ్రీకి రజనీకాంత్ మళ్లీ వచ్చిన క్షణం ఎంతో సంతోషంగా ఉన్నదని వివరించారు. రజనీకి శాలువా కప్పి, పుష్కగుచ్చం ఇస్తున్న ఫోటోలను పంచుకున్నారు. అందులో ఉద్ధవ్ ఠాక్రే, ఆయన భార్య రశ్మీ, కొడుకులు ఆదిత్య, తేజస్‌లు ఉన్నారు. ఆ ఫోటోలో వెనుక వైపు బాల్ ఠాక్రే చిత్రపటం ఉంది. అక్టోబర్ 2010లో, రజనీకాంత్ మాతోశ్రీ వద్ద బాల్ థాకరేని కలిశారు రజనీ కాంత్. రాజకీయాల్లోకి రానని చెబుతున్నప్పటికీ పుకార్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. అయితే రజనీ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.
An absolute delight to have Shri Rajnikant ji at Matoshri once again. pic.twitter.com/94MV7m0Rb9
— Aaditya Thackeray (@AUThackeray) March 18, 2023