రాధే శ్యామ్ ఎప్పటికీ కలవరా.. ఈ రాతలే సాంగ్ రివ్యూ

ఫిల్మ్ డెస్క్- రాధే శ్యామ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ తాజా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కరోనా కారణంగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చిన షూటింగ్ ఎట్టకేలకు పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది రాధే శ్యామ్. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింమ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

ఇదిగో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. రాధే శ్యామ్ నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేశారు. ఈ రాతలే.. అంటూ రాధే శ్యామ్ నుంచి అదిరిపోయే పాటను రిలీజ్ చేశారు. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు రావాల్సిన ఈ అప్డేట్, రాత్రి తొమ్మిది గంటలకు వచ్చింది. కాస్త ఆలస్యంగానైనా వచ్చిన రాధే శ్యామ్ సాంగ్ మొత్తానికి అభిమానులను మెప్పించింది.

Prabhas 1 1

కానీ ఈ పాటను యానిమేషన్‌ లా చూపించడంతో ప్రభాస్, పూజా హెగ్డేలు వీడియోలో అంత స్పష్టంగా కనిపించలేదు. ఐతే సినిమా కాన్సెప్ట్ ఏంటో ఈ పాట ద్వార చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. ఎవరో వీరెవరో కలవనీ ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా.. అంటూ పాట ప్రారంభమవుతుంది. ఆ టైంలో పూజా హెగ్డే ట్రైన్‌ లో ప్రయాణిస్తుండగా, ప్రభాస్ కారును స్యయంగా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటాడు.

ట్రైన్ లోంచి పూజా హెగ్డేను, కారులోంచి ప్రభాస్ చేతిలో చేయి వేసి తీసుకునే లోపు ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. అక్కడి నుంచి పాట కంటిన్యూ అవ్వగా.. వాళ్లిద్దరు గాల్లోకి ఎగిరిపోతారు. ఆ తరువాత సముద్రంలోకి వెళ్తాగా.. అక్కడ అరచేతి బొమ్మలు.. భూతద్దం లాంటివి మాత్రమే కనిపిస్తాయి. పాట చివరలో పూజా హెగ్డే, ప్రభాస్ లు నీళ్లలో మునిగిపోతూ కనిపిస్తారు. నీళ్లల్లో మునిగిన తరువాత అంతరిక్షంలో గ్రహాలు కనిపిస్తాయి. ఈ పాటను బట్టి పూజా హెగ్డే, ప్రభాస్ లు కలుసుకోరని, చనిపోతారన్న చర్చ జరుగుతోంది ఫిల్మ్ నగర్ లో.