ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా.. నటికి ప్రొఫెసర్ లైంగిక వేధింపులు

ఫిల్మ్ డెస్క్- ఒక్కోసారి జనాలు విచక్షణ కోల్పోతుంటారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు కూడా అసభ్యంగా ప్రవర్తించడం చాలా సందర్బాల్లో మంన చూశాం. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో అమానుషంగా ప్రవర్తించే వారిని సమాజం నుంచి వెలివెయ్యాలని అందరికి అనిపిస్తుంటుంది. ఇక సినిమా వారికైతే లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇలాంటి వేధింపులు మరీ పెరిగిపోయాయి. కానీ వేధింపులకు పాల్పడేది ఏ ఆకతాయే ఐతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ సొసైటీలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవాళ్లు కూడా ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడితే ఇంకేం చెబుతాం. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఇచ్చే స్వేచ్ఛను అదనుగా తీసుకొని కొందరు నెటిజన్లు విపరీతమైన కామెంట్స్ తో వారిని ఇబ్బందికి గురిచేస్తుంటారు. ప్రముఖ కోలీవుడ్ టీవీ నటి, సూపర్ సింగర్ ఫేం సౌందర్య బాలనందకుమార్‌కు సోషల్ మీడియా వేధికగా వేధింపులు ఎదురయ్యాయి. తన కోరిక తీరిస్తే ఎంత డబ్బు అడిగినా ఇస్తానంటూ ఓ వ్యక్తి ఆమెను ఇన్ స్తాగ్రామ్ లో మెసేజ్ పంపించాడు.

soundarya

నువ్వంటే నాకు చాలా ఇష్టం.. నా కోరిక తీరిస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. అంటూ సదరు వ్యక్తి పంపిన మెస్సేజ్ లకు సంబందించిన స్క్రీన్‌షాట్లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏంటంటే సౌందర్యకు ఇలా అసభ్యకరమైన మెస్సేజ్ లు పంపించింది ఓ కాలేజీ ప్రొఫెసర్. సొసైటీలో గౌరవప్రదమైన ప్రొఫెసర్ హోదాలో ఉంటూ ఇలా తనపై లైంగిక వేధింపులకు పాల్పడటంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు ప్రెఫెసర్ పని చేస్తున్న కాలేజీలోని అమ్మాయిలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సౌందర్య హెచ్చరించింది. ఆ ప్రోఫెసర్ ను ఎలాగైన గుర్తించి, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఇలా ఓ ఆడదానిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పాపానికి అతను ప్రతిఫలం అనుభవిస్తాడని తీవ్రంగా వ్యాఖ్యానించింది. రజనీకాంత్ నటించిన కబాలి, విజయ్ మాస్టర్ తదితర సినిమాల్లో కూడా సౌందర్య నటించింది. ఇక ఇలా ప్రొఫెసర్ సౌందర్యకు అసభ్యకరమైన మెస్సేజ్ లు పంపడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.