తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చి వెళ్లారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలా సినీ అభిమానుల గుండెల్లో ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానాన్ని సంపాదించుకున్న నటి సౌందర్య. తన అందంతో, అభినయంతో తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో ఒక్క సారిగా పరిశ్రమ ఉలిక్కిపడింది. అదీ కాక సౌందర్య చనిపోయే నాటికి ప్రగ్నెంట్ అంటూ వచ్చిన వార్తలపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు బయటపెట్టింది నటి ఆమని. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆమని.. 90 వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘జంబలకిడిపంబ’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యింది. తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ పెళ్లాం తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శుభలగ్నం ఆమె కెరీర్ నే మలుపు తిప్పిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి వరుస స్టార్ హీరోల సరసన నటిస్తూ.. స్టార్ హీరోయిన్ గా పేరొందింది. పెళ్లి తర్వాత క్రమంగా సినిమాలకు దూరం అయిన ఆమని.. ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్య్వూలో సౌందర్య మరణం గురించి, చనిపోయే నాటికి సౌందర్య ప్రగ్నెంటా? అన్న దానికి సమాధానాలు చెప్పింది.
ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ..”ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా ఉంటే అది సౌందర్యనే. కానీ తన మరణ విర్త విన్న వెంటనే నా మనసు ముక్కలైంది. సౌందర్య బదులు నేను చనిపోయినా బాగుండు అనుకున్నాను” అని ఆమని అంటే.. ఇలా ఎందుకు అనుకున్నారు అని యాంకర్ ప్రశ్నించగా..”పాపం సౌందర్య కు పెళ్లై అప్పటికి ఇంకా సంవత్సరమే అవుతుంది. సౌందర్య ఇంకా ఏమీ చూడ్లేదు. నేను జీవితంలో అన్నీ చూసేశాను. అదీ కాక నాకు అప్పటికింకా పిల్లలు లేరు. దాంతో జీవితంలో ఏదో వెలితిగా అనిపించేది. అంటూ భావోద్వేగానికి గురైంది. ఇక సౌందర్య తమ్ముడితో మీ పెళ్లి విషయం ఏంటి అని ప్రశ్నించగా.. సౌందర్య వాళ్ల అమ్మా నాన్నాతో నాకు చనువు ఎక్కువ. దాంతో నేను వారికి నచ్చడంతో వారు సౌందర్య తమ్ముడు అమర్ ను పెళ్లిచేసుకోవాలని కోరారు.
అయితే నేను వారు ఏదో సరదాకు అంటున్నారు అనుకున్నా కానీ నిజంగానే వారు పెళ్లి ప్రపోజల్ పెట్టారు. అయితే అప్పటికి నా దృష్టి మెుత్తం సినిమాలపైనే ఉండటంతో.. నేను కాదన్నాను. ఒక వేళ నేను అమర్ ను నేను పెళ్లి చేసుకుని ఉంటే నేను అమర్ స్మృతులతో బతికే దానినేమో అంటూ చెప్పుకొచ్చింది. ఇక సౌందర్య చనిపోయే నాటికి గర్భవతా? అని యాంకర్ అడగ్గా..”సౌందర్య అప్పటికి ప్రెగ్నెంట్ కాదు. చాలా మంది అప్పట్లో ఇలాంటి వార్తలు రాశారు. కానీ అవన్నీ నిజాలు కావు.. అంటూ సౌందర్యకు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. నేను ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది పెళ్లిళ్లకు వెళ్లాను.. అందులో సౌందర్య పెళ్లి ఒకటి. మేమిద్దరం అప్పట్లో అక్కాచెల్లెల్లాగా ఉండేవాళ్లం. నేను ఏ విషయాలనైనా తనతో షేర్ చేసుకునే దాన్ని” అంటూ చెప్పుకొచ్చింది.