సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిపై వచ్చినన్ని పుకార్లు.. ఇంక ఎవరి మీద రావేమో. సామాన్యంగా ఆడ, మగ మధ్య స్నేహం ఉంటే చాలు.. వారి మధ్య ఏదో బంధం ఉందని గుసగుసలాడుకుంటారు నేటికి కొందరు. సామాన్యులకే ఇలాంటి పరిస్థితి తప్పనప్పుడు ఇక సెలబ్రిటీల గురించి ఏం చెప్పగలం. ఓ హీరో-హీరోయిన్ జంటగా కనిపించినా.. లేదా వారు ఎవరితోనైనా కాస్త క్లోజ్‌గా మూవ్ అయినట్లు చూసినా.. ఇక పుకార్లకు రెక్కలు వస్తాయి. సదరు సెలబ్రిటీ కపుల్‌లో లవ్‌లో పడ్డారని.. వారి మధ్య అఫైర్ ఉందని.. పెళ్లి కూడా చేసుకుంటారని.. ఇలా రకరకాల వార్తలు ప్రచారం అవుతాయి. బాబోయ్ అవన్ని నిజం కాదు అని వారు చెప్పినా సరే.. పుకార్లు మాత్రం ఆగవు. అయితే సెలబ్రిటీలకు సంబంధించి ఇలాంటి పుకార్లు పుట్టుకురావడం ఇప్పుడు కొత్తేం కాదు. ఎప్పటి నుంచో ఉంది. టాలీవుడ్‌లో ఇలా ఎక్కువ పుకార్లు వచ్చిన జాబితాలో సీనియర్ హీరో జగపతి బాబు ఒకరు.
పలువురు హీరోయిన్లతో జగపతి బాబుకు అఫైర్ ఉందని బోలేడు వార్తలు ప్రచారం అయ్యాయి. మరీ ముఖ్యంగా సౌందర్యతో ఆయనకు ఎఫైర్ ఉందని బలంగా ప్రచారం అయ్యింది. ఇక ఈ వార్తలకు బలం చేకూర్చేలా.. ఇద్దరు ఒకరి ఇళ్లకు ఒకరు రాకపోకలు సాగించేవారు. దాంతో చాలామంది ఇవి నిజమని నమ్మేవారు. పైగా వీరిద్దరూ హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాక వీరిద్దరూ సినిమాలో ఎక్కువగా భార్య, భర్తలుగానే నటించారు. దాంతో ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు తెగ ప్రచారం అయ్యేవి.
ఈ క్రమంలో తాజాగా ఈ వార్తలపై జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. సౌందర్యతో తనకున్న రిలేషన్ ఏంటో బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు.. సౌందర్యతో తన రిలేషన్, ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. వాస్తవంగా చెప్పాలంటే.. మేం ఇద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్. సౌందర్య వ్యక్తిగతంగా చాలా మంచి అమ్మాయి. మేం మంచి స్నేహితులం. తన అన్న కూడా నాకు మంచి ఫ్రెండ్. మేం మాత్రమే కాక.. మా కుటుంబాలు కూడా చాలా క్లోజ్’’ అని చెప్పుకొచ్చారు.
‘‘ఎవరి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా.. కుటుంబ సమేతంగా హాజరయ్యేవాళ్లం. ఈ క్రమంలో సౌందర్య తరచు మా ఇంటికి రావడం.. నేను తన ఇంటికి వెళ్లడం జరిగేది. అది చూసి జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. మేం మంచి స్నేహితులం మాత్రమే. మా ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందంటూ వచ్చిన వార్తలను నేను కూడా విన్నాను.. కానీ పెద్దగా పట్టించుకోలేదు’’ అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు.
ఇక జగపతి బాబు హీరోగా కెరీర్ ప్రారంభించారు. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఇయన నటించిన మావిడాకులు, శుభలగ్నం, సర్దుకుపోదాం రండి వంటి చిత్రాలు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో జగపతి బాబు.. విలన్ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నారు. ఇక జగపతి బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.