పూజా హెగ్డేకు అల్లు అరవింద్ మెసేజ్

ఫిల్మ్ డెస్క్- మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బాగా బైప్ క్రియేట్ అవుతున్న సినిమా. అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఇక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ఈనెల అక్టోబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్స్ లో విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో శుక్రవారం సాయంత్రం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అంగరంగవైభవంగా జరిగింది.

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ ప్రీరిలీజ్ వేడుకలో బుట్టబొమ్మ పూజా హెగ్డె, అల్లు అరవింద్ లు ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో పూజా హెగ్డె మాట్లాడుతూ.. నాకు ఇష్టమైన నిర్మాత అల్లు అరవింద్.. ఈ విషయం నాలుగు, ఐదురోజుల క్రితం జరిగింది.. నేను షూటింగ్‌కు వెళ్తున్నాను.. కారులో ఉన్నాను.. ఆ సమయంలో నాకు మెసెజ్ వచ్చింది.. పైన నోటిఫికేషన్‌లో అల్లు అరవింద్ గారు అని కనిపించింది.. ఏం చేశారు, ఎందుకు చేశారు అని తెగ భయపడ్డాను.. అని చెప్పుకొచ్చింది.

Pooja Hegde 1

అల్లు అరవింద్ గారు మామూలుగా అయితే మెసెజ్ చేయరు అని అనుకున్నాను.. ఎంతో బాగా నటించావ్.. అని ప్రశంసలు కురిపించారు.. అలా ఆయన స్థాయికి ఆ మెసెజ్ చేయాల్సిన పని లేదు.. కానీ ఆయన చెప్పారు.. నాకు ఎంతో సంతోషంగా అనిపించింది.. అని అసలు విషయం చెప్పి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది పూజా హెగ్డే. ఈ బుట్టబొమ్మ ఇచ్చిన స్పీచ్, చెప్పిన మాటలు అందరనీ ఆకట్టుకున్నాయి. ఆ తరువాత మాట్లాడిన అల్లు అరవింద్ సైతం పూజా హెగ్డేపై తన ఇష్టాన్ని చెప్పారు.

అల్లు అరవింద్ ఏమన్నారంటే.. నువ్వు అన్నా, నీ నటన అన్నా నాకు ఎంతో ఇష్టం.. అది మా సినిమాల్లో పని చేసినా, వేరే సినిమాల్లో పని చేసినా సరే నువ్వంటే నాకు ఇష్టం.. అని అల్లు అరవింద్ చెప్పారు. ఆయన అలా చెబుతుంటే పూజా హెగ్డే కాస్త సిగ్గుపడింది. ఆమె మొహం సంతోషంతో వెలిగిపోయింది. ఇలా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పూజా, అల్లు అరవింద్ ఒకరిని ఒకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు.