పెళ్లి ఘడియలు వచ్చేశాయి, సందడిగా నిధి పెళ్లి వేడుక

ఫిల్మ్ డెస్క్- సినిమా స్టార్స్ కేవలం సినిమాల్లోనే కాకుండా కమర్సియల్ యాడ్స్ లో నటిస్తుంటారు. చాలా మంది హీరో, హీరోయిన్స్ ఇలా యాడ్స్ లో నటించి బాగానే సంపాదిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న అందాల భామ నిధి అగర్వాల్ సైతం కమర్సియల్ యాడ్స్ లో నటిస్తోంది. ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో నిధి అగర్వాల్ షాపింగ్ మాల్ యాడ్స్ చేస్తోంది.

నిధి అగర్వాల్ ఇప్పుడు ఇంట్లో ఉంటూ ప్రకటనలతో బాగానే వెనకేసుకుంటోన్నట్టు కనిపిస్తోంది. అసలే ఇక పెళ్లిళ్ల సీజన్ మొదలు కాబోతోంది. ఈ క్రమంలో నిధి అగర్వాల్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. ఇందులో భాగంగా నిధి అగర్వాల్ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ క్రమంలో ఆమె వేసిన పోస్ట్ బాగా వైరల్ అవుతోంది. ఇది పెళ్లి ఘడియలు వచ్చాయి.. ఫ్యాషన్ అండ్ గ్లామర్ ప్రేమికుల కోసం నేను సీఎంఆర్ సుముహూర్తం కలిసి పెళ్లి వేడుకను తీసుకొస్తున్నాం.. అని చెప్పింది నిధి

niddhi 1

సీఎంఆర్ సుముహూర్తంలో అదిరిపోయే కలెక్షన్లున్నాయి.. అందుకే మీ పెళ్లికి సీఎంఆర్ సుముహూర్తంలో షాపింగ్ చేయమని మీకు రికమండ్ చేస్తున్నాను.. ఆ పెళ్లి సందడిని మరింత సందడిగా మార్చేసుకోండి.. నిధి అగర్వాల్ ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ప్రకటన చూసి చాలా మంది నిజంగానే నిధి అగర్వాల్ పెళ్లి చేసుకోబోతోందా అని అనుకున్నారు.

ఇక సోషల్ మీడియాలో నిధి అగర్వాల్ బాగానే యాక్టీవ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో అభిమానులను బాగానే అలరిస్తోంది. ఇక నిధి అగర్వాల్ ఇలా ప్రకటనల్లోనే కాకుండా సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉంది. హరిహర వీరమల్లు, గల్లా అశోక్ హీరో చిత్రంలోనూ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరో రెండు, మూడు సినిమాలు కధా చర్చల దశలో ఉన్నాయని తెలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal)