పరువు నష్టం కేసులో కోర్టుకు మరోసారి గైర్హాజరైన బాలీవుడ్ రెబల్ కంగనా రనౌత్ అనారోగ్యం కారణంగా కంగనా కోర్టుకు హాజరు కాలేకపోయినట్టు ఆమె తరుపున లాయర్ కోర్టుకు తెలిపారు. ఆమెకు కొద్దిపాటి కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేయడంతో పాటు ఆమె మెడికల్ సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెను కోర్టు హాజరు నుంచి ఈ సారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రీసెంట్‌గా ఆమె నటించిన ‘తలైవి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా పలువురిని కలిసినట్టు ఆమె తరుపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె అనారోగ్యానికి గురైనట్టు చెప్పారు. అందుకే కోర్టు హాజరు నుంచి ఓ వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని కంగనా తరుపు లాయర్ కోర్టుకు తెలియజేసారు. ఆమెకు కోవిడ్ పరీక్ష చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఆమె రెండు డోసులు కోవిడ్ టీకా తీసుకున్నట్టు తెలిపారు.బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన కేసులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఇవాళ గట్టి వార్నింగ్ ఇచ్చింది. జావేద్ అఖ్తర్ వేసిన కేసు అంధేరి మెట్రోపాలిటన్ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. నటి కంగనా పదేపదే గైర్హాజరుకావడం, హాజరు నుంచి మినహాయింపు కోరుతూ లాయర్ ద్వారా పిటిషన్ వేస్తుండడం చూస్తుంటే కాలయాపన చేస్తునన ధోరణి కనిపిస్తోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాగే వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.
వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారాని జావేద్ అఖ్తర్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కంగన సర్దుబాటు చేసుకోకపోగా ఏకంగా ఈ కేసునే కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కేసు కొట్టేసేందుకు బాంబే హైకోర్టు ససేమిరా అనడంతో మెట్రోపాలిటన్ కోర్టులో కేసు విచారణ జరిగింది.