శివబాలాజీ భార్యకు వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

ఫిల్మ్ డెస్క్- తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికలు ముగిసినా ఇరు వర్గాల మధ్య వివాదం మాత్రం సమిసిపోవడం లేదు. ఇంకా రెండు గ్రూపుల మధ్య మాటల యుధ్దం కొనసాగుతూనే ఉంది. ఈనెల 10న ‘మా’ ఎన్నికల జరగ్గా, మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందింది. దీంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో గెలిచిన వారంతా రాజీనామా చేశారు.

ఈ క్రమంలో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫర్ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. అయితే మంచు విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆసక్తికరంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చాలా మంది మెగా ఫ్యామిలీ మీద చాలానే పంచ్‌లు, సెటైర్లు వేశారు. మంచు విష్ణుని స్టేజ్ మీద అభినందించేందుకు, శాలువాలు కప్పి ఫోటోలు దిగేందుకు చాలా అంతా పోటీ పడ్డారు. ఎంత సేపటికి స్టేజ్ మీద జనాలు కిందకి దిగకపోవడంతో మోహన్ బాబు రంగంలోకి దిగాడు.

Madhumitha 1

మధ్యలో మైకు అందుకుని తన ప్రసంగాన్ని మొదలుపెట్టాడు మోహన్ బాబు. చిరు కోపం ప్రదర్శిస్తూ అందరినీ వారించే ప్రయత్నం చేశాడు. ఏయ్ ఎవరు అక్కడ.. ఆ మూలకు ఉన్నది ఎవరు అంటూ మెల్లగా బెదిరించే ప్రయత్నం చేశాడు. అంతలో కల్పించుకున్న విష్ణు.. లైవ్ నడుస్తోంది అని మోహన్ బాబుకు చెప్పాడు. లైవ్ అయితే ఏం కాదు అంటూ మోహన్ బాబు తన స్టైల్లో సీరియస్‌గా తన ప్రసంగాన్ని కొనసాగించాడ మోహన్ బాబు.

మంచు విష్ణు ప్రమాణస్వీకార కార్యక్రమానికి శివ బాలాజీ భార్య, నటి మధుమిత వ్యాఖ్యాతగా వ్యవహరించింది. మోహన్ బాబు మాట్లాడుతోంటే మధుమిత మధ్యలో అటూ ఇటూ తిరిగింది. దీంతో మోహన్ బాబుకు కోపం వచ్చింది. ఏయ్.. అలా అటూ ఇటూ కదలొద్దు.. ఒకరు ప్రసంగిస్తుంటే అలా కదిలితే.. శ్రద్ద దెబ్బ తింటుంది.. అలా చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో మోహన్ బాబు ఏం మాట్లాడాలో మరిచిపోయాడు.