మోగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ డేట్ ఫిక్స్

Acharya Release Date Fix - Suman TV

ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య విడుదలకు సంబందించి ఎప్పటికప్పుడు వా.ిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది. స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్ కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆచార్య మూవీని డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌ చేస్తున్నారని ముందు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరిగింది.

ఇంకేముంది మెగా అభిమానులు పండగ చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఐతే అది అధికారిక ప్రకటన కాదని తెలియడంతో ఫ్యాన్స్ ఉస్సూరుమన్నారు. ఇదిగో ఇటువంటి సమయంలో ఆచార్య రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్ర‌వ‌రి 4, 2022న ఆచార్య చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా తెలిపారు.

85450422

మెగాస్టార్ చిరంజీవి సతీమణి శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌ టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి ఆచార్య సినిమాను నిర్మిస్తున్నారు. మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది.

ఆచార్య సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. మెగాస్టార్ చిరంజీవికి జోడీగా అందాల చందమామ కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తోంది. ఇక ఆచార్య సినిమాలో రామ్‌ చ‌ర‌ణ్ సిద్ధ అనే న‌క్స‌లైట నాయకుడి పాత్రలో క‌నిపించ‌నున్నారు. రామ్ చరణ్ ప్రేయ‌సిగా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది. ఆచార్య విడుదల తేదీని ప్ర‌క‌టిస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఇన్నాళ్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన మోగా అభిమానులకు ఆచార్య రిలీజ్ డేట్ కొత్త ఉత్సాహాన్నిస్తోంది.