మెలోడి బ్రహ్మ మణిశర్మ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరితో మణిశర్మ పని చేశారు. మెగాస్టార్ చిరంజీవి ‘చూడాలని వుంది’ సినిమాతో పుర్తిస్థాయి సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాకు సంగీతం అందించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. దీంతో మణిశర్మపై విమర్శలు వచ్చాయి. ఆయన అందించిన సంగీతం బాగాలేదని కొందరు విమర్శించారు. వీటిపై తాజాగా మణిశర్మ స్పందించారు. […]
గాడ్ ఫాదర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ ఫస్ట్ లుక్ నుంచి టీజర్, ట్రైలర్ ఇలా ప్రతి అంశం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచుకుంటూ పోతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి సైతం ప్రమోషన్స్ లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవలే అనంతపురంలో ఎంతో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం నిర్వహించారు. […]
మెగా స్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆచార్య. ఇప్పటికే చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉంది. హైదరాబాద్‌లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిపారు చిత్ర బృందం. ఇక సెన్సార్ రివ్యూలో ఆచార్యకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా కోసం మెగా అభిమానులు ఆత్రుతగా […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సినిమా అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న చిత్రం ఆచార్య. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం జోరుగా సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. కొరటాల శివతో కలిసి చిరంజీవి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో సినిమా గురించి […]
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. చాలా రోజుల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ స్క్రీన్ పై కలిసి నటించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు సినిమా బృందం ప్రమోషన్స్ జోరు పెంచేసింది. ఫస్ట్ టైమ్ చిరు- రామ్ చరణ్ ఇద్దరూ భలే భలే బంజారా అనే సాంగ్ కు స్టెప్పులేయనున్నారు. ఈ వీడియో ప్రోమో ఏప్రిల్ 18న విడుదల […]
ఫిల్మ్ డెస్క్- మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య విడుదలకు సంబందించి ఎప్పటికప్పుడు వా.ిదాల పర్వం కొనసాగుతూ వస్తోంది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కోసం మెగా అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆచార్య మూవీని డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారని ముందు ఫిల్మ్ నగర్ లో ప్రచారం జరిగింది. ఇంకేముంది మెగా అభిమానులు పండగ చేసుకునేందుకు సిద్దమయ్యారు. ఐతే అది అధికారిక ప్రకటన కాదని తెలియడంతో ఫ్యాన్స్ ఉస్సూరుమన్నారు. […]
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ. సందేశాత్మక కథలను కమర్షియలైజ్ చేసి తెరకెక్కించడంలో ఈయన ఆరితేరిపోయాడు. ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు నాలుగే. 2013లో ప్రభాస్ మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించాడు. ఈ నాలుగు విజయం సాధించాయి. కొరటాల శివ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా తాను సోషల్ మీడియా నుంచి తప్పుకుంటున్నానని […]