కారు పన్ను కడతా! కోర్టులో తప్పు ఒప్పుకున్న విజయ్!

actor vijay tax paid

తమిళనాట హీరో విజయ్ కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే.., అదే స్థాయిలో విజయ్ చుట్టూ ఎప్పుడు వివాదాలు నడుస్తుంటాయి. తమిళనాడు దివంగతనాయకురాలు జయలలితతో కూడా ఈ హీరోకి విబేధాలు ఉన్నాయి. ఇక విజయ్ ఇప్పుడు కూడా అదే పంధాలో ముందుకు వెళ్తున్నారు. అయితే.., తెరపై నీతి నిజాయతీగా కనిపించే పాత్రలలో కనిపించే ఈ స్టార్ హీరో.., విదేశాల నుండి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయిస్ కారుకి సుంకం చెల్లించనందుకు ఈ మధ్య వార్తల్లో నిలిచారు. నిజానికి ఈ రచ్చ నడుస్తోంది ఇప్పటి నుండి కాదు. విజయ్ ఈ కారుని 2012లో కొన్నారు. అప్పటి నుండి ఆయన పన్నుని కట్టడానికి అంగీకరించడం లేదు. ఈ కేసు అప్పటి నుండి కోర్టులో నడుస్తూనే ఉంది.

ఇటీవల మద్రాస్ హైకోర్టుకి చెందిన సింగిల్ బెంచ్ జడ్జి విజయ్ పన్ను చెల్లించాలనే తీర్పు ఇచ్చారు. దీంతో పాటు.., పన్ను కట్టడంలో ఇంత ఆలస్యం చేసినందుకు ఆయనకి లక్ష రూపాయల ఫైన్ కూడా వేశారు. ఇదే సమయంలో జడ్జి విజయ్ వ్యక్తిత్వంపై సంచలన కామెంట్స్ చేశారు. “మీరు రియల్ లైఫ్ లో కూడా హీరోగా ప్రవర్తిస్తే మంచిదని జడ్జి కామెంట్స్ చేయడం విశేషం”. కానీ.., ఈ తీర్పుపై విజయ్ మళ్ళీ అప్పీల్ కి వెళ్లారు. ఇప్పుడు ఆ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది మద్రాస్ హైకోర్టు. కానీ.., ఫైన్ అవసరం లేదని, పన్ను మాత్రం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు కూడా చెప్పడంతో విజయ్ అందుకు అంగీకరించాడు.

actor vijay tax paidనిజానికి విజయ్ ఇన్ని రోజులు ఫైట్ చేసిందే తాను ఆ పన్ను కట్టాల్సిన అవసరం లేదని. ఇప్పుడు ఇంత రచ్చ జరిగాక, దేశ వ్యాప్తంగా తన ఇమేజ్ కి డ్యామేజ్ జరిగాక విజయ్ పన్ను కట్టడానికి ముందుకి రావడం ఆయన ఫ్యాన్స్ కి సైతం షాక్ కలిగిస్తోంది. ఈ మాత్రం దానికి ముందే ఆ పన్ను కట్టి ఉంటే ఇంత రచ్చ జరిగేది కాదు కదా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 70 నుండి 80 కోట్ల రూపాయల మధ్యలో పారితోషికం తీసుకుంటున్నాడు విజయ్. రానున్న కాలంలో రాజకీయాల్లోకి కూడా రావాలని కలలు కంటున్నాడు. మరి.. ఈ కారు ఫైన్ విషయంలో విజయ్ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.