రాజకీయాల నుంచి తప్పుకోనున్న కమల్ హాసన్?

చెన్నై (నేషనల్ డెస్క్)- ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధ్యక్షులు కమల్ హాసన్ ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా.. శాస్వతంగా పాలిటిక్స్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నారా.. అంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఈ మేరకు కలమ్ హాసన్ త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. కమల్‌ హాసన్ ఏర్పాటు చేసిన మక్కల్‌ నీది మయ్యం పార్టీ మొన్న జరిగిన తమిళనాడు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆయన పార్టీ నుంచి కాదు కదా స్వయంగా కమల్ హాసన్ కూడా ఎన్నికల్లో గెలవలేకపోయారు. దీంతో కమల్ తో పాటు మక్కల్ నీది మయ్యమ్ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు.

మరోవైపు కమల్ హాసన్ పార్టీ కి అప్పుడే ముఖ్యమైన నేతలంతా రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరైతే సైలెంట్ గా వేరే పార్టీలో చేరిపోతున్నారట. మక్కల్ నీది మయ్యం పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ సైతం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఇటవంటి ప్రతికూల పరిణామాల నేపధ్యంలో ఇక రాజకీయాల్లో తాను కొనసాగలేనని కమల్ హాసన్ ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. అందుకే రాజకీయాల నుంచి శాస్వతంగా తప్పుకోవాలని కమల్ ]డిసైడ్ అయ్యారట. దీనిపై త్వరలోనే కమల్ ఓ ప్రకట చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.