ఈ బ్యూటీ ఓ సింగర్, అలా పేరు తెచ్చుకున్న కొన్నాళ్ల తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ పేరు రాకపోగా.. ఐరన్ లెగ్ అని తెగ ట్రోల్ చేశారు. అయినా సరే ఆమె వాటిని భరిస్తూనే వచ్చింది. తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేసింది. ఆ విషయంలో సక్సెస్ అయింది. సక్సెస్ కావడం గొప్ప కాదు దాన్ని నిలబెట్టుకోవడం గ్రేట్. ఈ విషయంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ ఇంకా తడబడుతూనే ఉంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నప్పటికీ.. సినిమా హిట్ అయితే హీరోలకు పేరు వస్తోంది. కానీ ఈమెకు మాత్రం ఫేమ్ అంతంత మాత్రంగానే వస్తుంది. మరి ఆ భామ ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి, హీరోయిన్ శ్రుతిహాసన్. తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు కమల్ హాసన్ కు పెద్ద కూతురు. తండ్రి హీరోగా చేసిన ‘హే రామ్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. 2009లో ‘లక్’ సినిమా చేసింది. ఇక 2011లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత సెవెన్స్ సెన్స్, ఓ మై ఫ్రెండ్, త్రీ లాంటి సినిమాలు చేసినప్పటికీ హిట్ కొట్టలేకపోయింది. ఎప్పడుతే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేసిందో.. ఈమె లక్ కలిసొచ్చింది. మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకునేసరికి వరస అవకాశాలు వచ్చాయి. అలా ‘బలుపు’, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, ప్రేమమ్, కాటమరాయుడు, క్రాక్, వకీల్ సాబ్ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది.
ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ అయిన మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ చేస్తుంది. ఇది కాకుండా ప్రభాస్-ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ‘బెస్ట్ సెల్లర్’ అనే హిందీ వెబ్ సిరీస్ తో ఓటీటీలోకి కూడా అడుగుపెట్టనుంది. ఇదంతా పక్కనబెడితే.. శ్రుతిహాసన్ కు శాంతను అనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ కూడా ఎప్పుడూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ ఉంటారు. అందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోలను కూడా ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా ఈమె ముఖం అంతా కూడా వాచిపోయింది. ఈ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో శ్రుతికి అసలు ఏమైందని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటున్నారు.