టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. అందరి దర్శకులతో పోలిస్తే ఈయన శైలీ ప్రత్యేకమనే చెప్పాలి. మొదటి సారిగా తెలుగు చిత్రపరిశ్రమకు కొత్తబంగారు లోకం అనే సినిమాతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంతో ఆయన గొప్ప విజయాన్ని సాధించాడు. మొదటి మూవీతోనే అనుకోని విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్ అడ్డాల తన సత్తా ఏంటో చూపించాడు. ఇక వరుణ్ సందేశ్, స్వేత బసు హీరో, హీరోయిన్లుగా కలిసి నటించిన ఈ సినిమా టాలీవుడ్ లో ప్రత్యేకమైన మూవీగా గుర్తింపు పొందింది. ఇక ఇటీవల విక్టరీ వెంకటేష్ హీరోగా నారప్ప అనే సినిమాను రూపొందించాడు శ్రీకాంత్. ఓటిటిలో తాజాగా విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.
ఇక ఈ నేపథ్యంలోనే మరో మల్టీస్టారర్ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల సిద్దమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మల్టీ స్టారర్ సినిమాలను తెరకెక్కించడంలో శ్రీకాంత్ దిట్ట అనే చెప్పాలి. గతంలో హీరో వెంకటేష్, మహేష్ బాబు హీరోగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే ఓ మల్టీ స్టారర్ మూవీని తెరకెక్కించాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచి ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఇక రానున్న రోజుల్లో మరో క్రేజీ మల్టీ స్టారర్ కి ప్రయత్నాలు చేస్తున్నాడట శ్రీకాంత్ అడ్డాల. ఇక దీనిపై అప్పుడే ఫీల్మ్ నగర్ లో చర్చ జోరుగా సాగుతోంది.
ఈ మల్టీ స్టారర్ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ నటులైన కమల్ హాసన్, వెంకటష్ కలిసి నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో వీళ్లిద్దరు ఈనాడు అనే సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు అదే కాంబినేషన్ మరో సారి రిపీట్ అవ్వనుందని తెలుస్తోంది. ఇక శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ మరో మల్టీ స్టారర్ సీనిమా రానుండటంతో దీనిపై అంచనాలు భారీగా ఉండనున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సినిమా కోసం కథను సిద్ధం చేసే పనుల్లో నిమగణమయ్యాడట శ్రీకాంత్ అడ్డాల. మరి ఈ సినిమాపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి మరి.