తాలిబన్ల రాజ్యంలో ఘనంగా అమ్మవారి నవరాత్రి వేడుకలు..!

ప్ర‌పంచం వ్యాప్తంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పేరు ఎంత‌లా వినిపిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ అధికారంలోకి వ‌చ్చిన తాలిబన్ల పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర‌మైన చర్చ జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. కానీ ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లకు అక్కడ ఉన్న హిందువులు ఏమాత్రం బయపడటం లేదు. అమెరికా సైన్యం ఉన్నంత వరకు మైనారిటీ హిందువు కమ్యూనిటీ కూడా ఇక్కడ బాగా జీవించింది.

FAGAS minతాలీబన్లు పాలనలోకి వచ్చిన తర్వాత హిందువులపై కూడా ఇప్పుడు ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు.. ఇబ్బందులు ఉన్నా.. కాబూల్‌ లోని ఆశామాయి ఆలయంలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వందలాదిమంది హిందువులు , సిక్కులు నవరాత్రి వేళ మాతా ఆలయంలో భజనలు చేశారు కీర్తనలు పాడారు. తాలిబన్ల రాజ్యంలో కూడా మైనారిటీలు అక్కడ భక్తిశ్రద్దలతో నవరాత్రి వేడుకలు నిర్వహించడం సంచలనం రేపింది.

FSFGASG minకాగా, కాబూల్‌లో ఇంకా 150 మందికి పైగా హిందువులు , 200 మందికి పైగా సిక్కులు ఉన్నారు. తాజాగా ఆశామాయి దేవాలయ నిర్వహణ కమిటీ ఛైర్మన్ రామ్ శరణ్ సింగ్ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా కాబూల్ లోని అస్మాయి దేవాలయంలో కీర్తనలు, భజనలు నిర్వహించాము. తాలిబాన్ అంతరాయం కలిగించలేదు. ఈ కార్యక్రమానికి 150 మంది స్థానిక భక్తులు హాజరయ్యారని ఆయన వెల్లడించారు. అలాగే పేదలకు ఆహారాన్ని దానం చేసే భోజన భండారా కూడా నిర్వహించామని రామ్ శరణ్ సింగ్ తెలిపారు.