నా జీవితంలో జరిగిందే నేను ట్వీట్ చేశాను: హీరో సిద్దార్ద్

siddharath tweet

టాలీవుడ్ లో ఇప్పుడు బాగా చర్చనీయాంశమవుతున్న అంశం సమంత-నాగచైతన్య విడాకులు. దీంతో సామ్-చైతు సుధీర్ఘ చర్చల అనంతరమే మేము విడాకులు తీసుకుంటున్నామని వీరిద్దరూ అధికారికంగా తెలిపారు. వీరిద్దరి వార్తతో అభిమానులు కాస్త షాక్ కు గురయ్యారనే చెప్పాలి. అయితే వీరిద్దరి విడాకుల అంశంపై టాలీవుడ్ లోని కొందరు సినీ నటీనటులు స్పందించి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించి ట్వీట్ చేశాడు సమంత మాజీ ప్రియుడు హీరో సిద్ధార్థ్.

మోసం చేసిన చీటర్స్ ఎప్పుడు కూడా బాగుపడలేరనే అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశాడు. ఇది ఎవరిని ఉద్దేశించి అయి ఉంటుందబ్బా అని అంతా ఆలోచించారు. కొంపదీసి సమంత మీద సిధ్దార్ధ్ సెటైర్లు వేశాడా అని చాలా మంది చర్చించుకున్నారు కూడా. నాగచైతన్య, సమంతలు విడిపోతున్నాం అని అధికారికంగా చెప్పిన కాసేపటికే సిద్దార్ధ్ ఇలాంటి కొటెషన్ ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో, ఖచ్చితంగా సమంత-నాగచైతన్య ను ఉద్దేశించి పెట్టిందని అందరూ చెవులు కొరుక్కున్నారు.

అయితే తాజాగా సిద్దార్థ్ ఓ ప్రముఖ ఛానెల్ ద్వారా మాట్లాడుతూ ఆయన చేసిన ట్వీట్ పై స్పందించాడు. నా జీవితంలో జరిగింది మాత్రమే నేను ట్వీట్ చేశానని, ఎవరో తన గురించి అనుకుంటే నేను ఏం చేయలేనని తెలిపాడు. ఇక మా ఇంటి దగ్గర కుక్కల సమస్య ఉంటే నేను ట్వీట్ చేశాను తప్పా.. దానికి ఎవరో బాధపడితే నాకు సంబంధం ఏంటని అన్నారు సిద్దార్థ్. అయితే ఇప్పుడు సిద్దార్థ్ కావాలనే తప్పించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక తను చేసిన ట్వీట్ పై సిద్దార్థ్ చేబుతున్న వ్యాఖ్యల పట్ల మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.