పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా..

nutrition food

 

హెల్త్ డెస్క్- కరోనా సమయంలో అంతా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై శ్రద్ద పెట్టాలి. పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని వాళ్లకు ఇవ్వాలి. రెగ్యులర్ గా పిల్లకు పోషకాలు కలిగిన ఫుడ్ తినిపించడం వల్ల వారిలో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది. మరి ఏయే ఆహార పదార్ధాల్లో ఇమ్యునిటీనీ పెంచే పోషకాలున్నాయో తెలుసుకుందామా.

బాదం పప్పు…
బాదంపప్పు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాదాంపప్పులో విటమిన్ ఈ, మాంగనీస్ ఉంటాయి. ఇవి రోగనిరోదక శక్తిని బాగా పెంపొందిస్తాయి.  బాదాం పప్పును నానబెట్టి, తొక్క తీసి పిల్లలకు తినిపించాలి.

egg

గుడ్లు..
గుడ్లలో విటమిన్ డీ బాగా ఉంటుంది. విటమిన్ డీ తక్కువైతే శరీరం వీక్ అయిపోతుంది. ఇమ్యునిటీ పవర్ తగ్గిపోతుంది. అందుకే విటమిన్ డీ పుష్కలంగా ఉన్న ఎగ్ ను ఉకబెట్టి పిల్లకు తినిపించాలి. ఇక విటమిన్ డీ సూర్య రశ్మి నుంచి కూడా లభిస్తుందని మీకు తెలుసు కదా.

పాలకూర
అకు కూరల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి. అందులోను పాకూరలో ఇమ్యూన్ సిస్టమ్‌ని పెంచే మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. పాల కూరలో విటమిన్స్ ఏ, సీ, ఈ, కే, ఫోలేట్, మాంగనీస్, జింక్, సెలీనియం, ఐరన్ ఉన్నాయి. కాబట్టి పిల్లకు అందించే ఆహారంలో పాలకూర ఉండేలా చూసుకోండి.

food

చిలగడ దుంప
బీటా కెరొటిన్ కూడా ఇమ్యునిటీ పవర్ ను పెంచుతుంది. ఇక చిలగడ దుంపల్లో బీటా కెరొటిన్  బాగా ఉంటుంది. విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇవి రెండూ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చిలగడ దుంపలను ఉడికించి, లేదా సూప్ గా కూడా పిల్ల్లకు ఇవ్వవచ్చు.

గింజలు…
సీడ్స్ ఇమ్యునిటీ బూస్టర్స్ గా పనిచేస్తాయి. అందుకే పిల్లలకి అన్ని రకాల సీడ్స్ ఇవ్వండి. గుమ్మడి సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి. ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల విటమిన్ ఈ, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అందుతాయి. అందుకని మీ పిల్లలకు అందుబాటులో ఉన్న సీడ్స్ ను అందించండి.

ఓట్స్
ఇక ఓట్స్‌లో ఉండే ఫైబర్ శరీరంలోని డెడ్ సెల్స్‌ని యాక్టివేట్ చేస్తుంది. ఈ సెల్స్ బ్యాక్టీరియా, వైరస్, ఇంకా ఇతర ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడుతుంది. వీటిని ఓవర్ నైట్ ఓట్స్‌గా పిల్లలకు అందించవచ్చు.

food

సిట్రస్ ఫ్రూట్స్
పిల్లలకు సీజనల్ పండ్లను తినిపిస్తూ ఉండాలి. ప్రధానంగా కమలా పండు, బత్తాయి పండు, జామ పండు వంటి సిట్రస్ ఫ్రూట్స్‌ అందించాలి. ఈ పళ్లలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ ని కలిగి ఉండటంవల్ల ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇక విటమిన్ సీ బాడీ పోషకాలని గ్రహించేందుకు అవసరమైన సాయం చేస్తుంది.

పప్పులు
పిల్లలకు తినిపించాల్సిన మరో ఆహారం పప్పులు. పప్పుల్లో ప్రొటీన్, ఫైబర్, ఫోలేట్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి చాలా పోషకాలు ఉన్నాయి. అంతే కాదు పప్పుల్లో ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి, ఇవి శరీరం రోగాల బారిన పడకుండా రక్షిస్తాయి. పప్పు ను టమాాట, దోసకాయతో కలిపి వండితే పిల్లలు బాగా తింటారు.

పచ్చి బఠానీ
ఇక పచ్చి బఠానీలు కూడా మంచి ఆహారంగా చెప్పుకోవచ్చు. బఠానీల్లో విటమిన్స్ ఏ, బీ1, బీ6, సీ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, కెరొటినాయిడ్స్, పాలిఫెనాల్స్ అన్నీ కలిసి ఇమ్యూనిటీ పెంపొదిస్తాయి. పచ్చి బఠానీలను అన్ని రకాల కూరల్లో వేసి వండుకోవచ్చు.

మజ్జిగ
మజ్జిగలో ఉండే హెల్దీ బ్యాక్టీరియా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా వల్ల అనేక వ్యాధులు మనని దరి చేరకుండా ఉంటాయి. పిల్లలకు మజ్జిగను అన్నంలో వేసి తినిపించవచ్చు. లేదంటే మజ్జిగలో కాస్త చక్కెర, లేదా బెల్లం వేసి తాగించవచ్చు.