ఏపీలో విద్యార్థులకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకూ ప్రతీ పేద విద్యార్థి చదువుకోవాలన్న ఆకాంక్షతో బడికి రప్పించేలా అమ్మఒడి పేరుతో రూ. 15 వేలు తల్లులు ఖాతాల్లో వేసుకొచ్చిన జగన్.. మరోసారి విద్యార్థుల కోసం ఆలోచిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో విద్యార్థులకు సీఎం జగన్ మరో శుభవార్త చెప్పారు. ఇప్పటి వరకూ ప్రతీ పేద విద్యార్థి చదువుకోవాలన్న ఆకాంక్షతో బడికి రప్పించేలా అమ్మఒడి పేరుతో రూ. 15 వేలు తల్లులు ఖాతాల్లో వేసుకొచ్చిన జగన్.. మరోసారి విద్యార్థుల కోసం ఆలోచిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు బాగా చదువుకోవాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందాలి. విద్యార్థులకు సరైన పోషకాలు అందజేయడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తోంది. ఈ క్రమంలో పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో మరో పౌష్టికాహారాన్ని చేర్చాలని జగన్ నిర్ణయించారు. జగనన్న గోరుముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జగనన్న గోరుముద్ద పథకంలో మరో పోషకాహారాన్ని చేర్చారు.
పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు రాకుండా నివారించడానికి మధ్యాహ్న భోజన పథకంలో రాగి జావను చేర్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మార్చి 2వ తేదీ నుంచి విద్యార్థులకు రాగి జావ అందించనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి శ్రీ సత్యసాయి ఛారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యం కానుంది. సీఎం జగన్ సమక్షంలో విద్యాశాఖ అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు ఎంఓయూ చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ ను పెంచడంతో పాటు విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపరిచి.. డ్రాపౌట్స్ ను తగ్గించడానికి మధ్యాహ్న భోజనంలో పౌష్టికాహారాన్ని అందిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 44,392 పాఠశాలల్లో 37,63,698 విద్యార్థులు జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పౌష్టికాహారాన్ని పొందుతున్నారు.
జగనన్న గోరుముద్ద మెనూలో మరో న్యూట్రియెంట్ ‘రాగిజావ’
జగనన్న గోరుముద్దలో మరో న్యూట్రియెంట్ రాగిజావ చేరింది. మధ్యాహ్న భోజన పథకంలో మార్చి 2 నుంచి రాగిజావ ఇవ్వనున్నారు. పిల్లలకు ఐరన్, కాల్షియం లోపాలు లేకుండా నివారించడానికి రాగిజావను చేరుస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. pic.twitter.com/LKGflQfTCq— Bala Swamy Martha™ (@BalaSwamyDMO) February 9, 2023
ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి పదో తరగతి వరకూ చదివే ప్రతీ విద్యార్థికి పౌష్టికాహారం అందజేస్తుంది. పిల్లల్లో పౌష్టికాహార లోపం తలెత్తకుండా వారంలో 5 రోజులు గుడ్లు, 3 రోజులు బెల్లం, పల్లీ చిక్కీ ఇవ్వాలని జగన్ ఆదేశించారు. బెల్లం, చిక్కీ ఇవ్వని రోజుల్లో రాగి జావ అందించాలని సూచించారు. ఈ మేరకు మధ్యాహ్న భోజనంలో బెల్లం, చిక్కీ బదులు రాగి జావను మెనూలో చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వారంలో 3 రోజుల పాటు రాగి జావను మధ్యాహ్న భోజనంలో చేర్చారు. ఐరన్, కాల్షియం లోపాలను నివారించేందుకు ప్రభుత్వం విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో రాగి జావను ప్రవేశపెట్టడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
జగనన్న గోరుముద్ద పిల్లలకు పౌష్టికాహరం, రుచిగా, శుచిగా మెనుని మార్చిన జగనన్న ప్రభుత్వం.#Educationreforms #JaganannaVidyaDeevena #JaganannaVasathiDeevena #JaganannaVidyaKanuka #JaganannaGoruMuddha #YSRSampoornaPoshana #YSRPrePrimarySchools #JaganannaAmmaVodi pic.twitter.com/9CJn36Aax2
— Jagane Kavali (@JaganeKavali) February 9, 2023