వాగు అవతల అంబులెన్స్.. ఫిట్స్ వచ్చిన చెల్లిని బుజాన వేసుకుని వాగులోకి

Elder Brother who crossed the river wearing the booze of the sister who came to Fitz -Suman Tv

మంచిర్యాల- తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వరదలు పోటెత్తుతున్నాయి. వాగులు పొంగి పొర్లుతున్నాయి. వంకలు గిర్లు తిరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో జన జీవనం ఎక్కడికక్కడ స్తంబించిపోయింది. ఇటివంటి సమయంలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే.. ఆమ్మో ఉహించడానికే భయంగా ఉంది కదా. కానీ ఓ పాపకు ఏకంగా ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పడిన నరకయాతన వర్ణణాతీరం.

మంచిర్యాలలో గత వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జనం ఎవరు కూడా అవసరం ఐతే తప్ప బయటకు రావడం లేదు. ఇటువంటి సమయంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన నిట్టూరి ప్రవళిక కు ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇంకేముంది ఆమె కుటుంబ సభ్యులకు వణుకుపుట్టుకుంది. ఎందుకంటే ఆ ఊరి నుంచి ఆస్పత్రికి వెళ్లాలంటే సమీపంలోని వాగు దాటి వెళ్లాలి. కానీ భారీ వర్షాలకు ఆ వాగు పొంగి పొర్లుతోంది. ఇదిగో అలాంటి సమయంలో పాపకు ఫిట్స్ రావడంతో ఏంచేయాలో వారికి తోచలేదు.

Elder Brother who crossed the river wearing the booze of the sister who came to Fitz -Suman Tvవాగు వరకు స్కూటీపై ఆ పాపను తీసుకుని వచ్చారు. ఫిట్స్ తో ఆమె గిల గిలా కొట్టకుుంటోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఏంచేయాలో పాలుపోని ఆ పాప అన్నయ్య చివరికి ప్రాణాలకు తెగించాడు. తన చెల్లిని బుజాన వేసుకుని బయలుదేరాడు. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులోంచి ఏలా వెళ్తారని ఆంతా కంగారు పడ్డారు. కానీ ఇవేవి లెక్కచేయేని ఆ అన్నయ్య, తన చెల్లిని బుజాన వేసుకుని వాగులోకి దిగాడు.

అతనికి తోడుగా అమ్మ, మరో ఇద్దరు వచ్చారు. ఏదేమైనా కొంత దైర్యం చేసి వేగంగా ప్రవహిస్తున్న వాగులో తన చెల్లిని బుజాన వేసుకుని మెల్లిగా వెళ్లాడు. ఒకానొక సమయంలో వాగులో కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా చెల్లిని భద్రంగా బుజాన వేసుకుని వాగు దాటాడు ఆ అన్నయ్య. ఆ తరువాత అవతలి వైపు సిద్దంగా ఉన్న అంబులెన్స్ లో చెల్లిని తీసుకుని ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్ కు వెళ్లిన తరువాత చికిత్స చేసిన వైద్యులు పాప ప్రాణానికి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.