ఈపాస్ ల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే మిమల్ని ఎవ్వరూ ఆపరు!

లాక్ డౌన్ సమయంలో ప్రయాణాలు చేయాలని ఎవ్వరూ అనుకోరు. కానీ.., అనుకోని కారణాలతో ఒక్కోసారి ప్రయాణం చేయక తప్పదు. అలాంటి సందర్భాలలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా ఈపాస్ విషయంలో కొన్ని నిబంధనలు ఫాలో అయ్యి.., జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే పక్క రాష్ట్రాలలో కూడా మీ ప్రయాణాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి ఈ పాస్ ల విషయంలో తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏవో ఇప్పుడు చూద్దాం. ముందుగా లాక్ డౌన్ సమయంలో ఇతర రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ కి రావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏపీలో ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉంది. కాబట్టి ఉదయం 6 నుండి 12:00 గంటల మధ్యలోనే ఏపీలోకి ప్రవేశించేలా ప్లాన్ చేసుకోండి. ఇలాంటి సందర్భంలో ఎలాంటి ఈపాస్ అవసరం లేదు. మిగతా సమయాల్లో మాత్రం ఈపాస్ కచ్చితంగా ఉండాల్సిందే. ఇక అత్యవసర సేవల వారికి కూడా ఈ పాస్ అవసరం లేదు. ఇక రాష్ట్రంలోనే ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి. సిటిజన్ సర్వీస్ పోర్టల్, ట్విట్టర్, ఫేస్ బుక్, ద్వారా కూడా ఏపీలో ఈపాస్ దక్కించుకోవచ్చు.

e2ఇక ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా లోకి ప్రవేశించాలంటే ఈపాస్ రూల్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణాలో ఉదయం 6 నుండి 10 వరకు నిత్యవసరాల కోసం ప్రజలు బయటకి రావడానికి అనుమతి ఉంది. 10 తరువాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది. కానీ.., 10 లోపే మీ గమ్యాన్ని చేరుకునే సమయంలో కూడా తెలంగాణలోకి ఎంటర్ అవ్వాలంటే ఈపాస్ ఉండాలి. policeportal.tspolice.gov.in అనే పోర్టల్ ద్వారా తెలంగాణ ఈ-పాస్ పొందవచ్చు. ఇక పక్క రాష్ట్రాల నుండి తమిళనాడు లోకి ప్రవేశించాలంటే ఈపాస్ తప్ప మరో ఆయుధం లేదు. ఎందుకంటే తమిళనాడులో కేసులు ఎక్కువ ఉన్నాయి. దీనితో అక్కడ పూర్తి స్థాయి లో కర్ఫ్యూ విధించారు. ఒక తమిళనాడు మాత్రమే కాదు.., ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి. ఇక శుభకార్యాలు, అంతక్రియలకు సంబంధించి ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి.., సంబంధిత స్థానిక అధికారుల వద్ద పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రూల్స్ అన్నీ ఫాలో అయితేనే లాక్ డౌన్ లో ప్రయాణాలు సులభతరం అవుతాయి. లేదా బయటకి వెళ్ళాక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పైగా.., మన కోసమే ప్రాణాలకి తెగించి డ్యూటీ చేస్తున్న పోలీసులకు మనం అదనపు భారం కాకూడదు. సో.. ప్రయాణం అత్యవసరం అయితేనే బయటకి వద్దాం. అప్పుడు కూడా అన్నీ రూల్స్ పాటిద్దాం. చూశారు కదా..? ఈ వీడియోపై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.