వాడు సినిమా తీసేలోపు సినిమా చూపిద్దాం.. దృశ్యం-2 ట్రైలర్ అదుర్స్

ఫిల్మ్ డెస్క్- దృశ్యం.. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలుసు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించగా, తెలుగులో రీమేక్ చేశారు. అదిగో దీనికి సీక్వెల్ గా దృశ్యం-2 తీయగా అది కూడా మంచి సక్సెస్ సాధించింది. అందుకే తెలుగులో మళ్లీ హీరో వెంటకేశ్, మీనా జంటగా దృశ్యం-2 సినిమా రూపొందించారు.

దృశ్యం-2 నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. ఈ నేపధ్యంలో దృశ్యం-2 ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. రెండున్నర నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ అందరిని ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ ప్రారంభంలోనే రాంబాబు చేసిన హత్య కేసు గురించి ఉర్లో వాళ్లు గుర్తు చేసుకుంటారు. ఆ తరువాత రాంబాబు ఓ సినిమా ధియేటర్ నడపడం కనిపిస్తుంది. అంతే కాదు రాంబాబు నిర్మాతగా ఏకంగా ఓ సినిమాను నిర్మించే పనిలో ఉన్నట్లు ట్రైలర్ లో చూపించారు.

Drushyam 2 1

ఈ క్రమంలోనే.. ఇప్పుడు రాంబాబు ఫోకస్‌ మొత్తం సినిమా తీయడం మీద ఉంది.. చట్టానికి దొరకనన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు.. వాడు సినిమా తీసేలోపు.. వాడికి సినిమా చూపిద్దాం.. అని నటుడు సంపత్‌ రాజ్ డైలాగ్ ఇంట్రస్టింగ్ గా ఉంది. వరుణ్ హత్య కేసులో రాంబాబు కుటుంబం పోలీసులకు దొరికిపోయిందా.. రాంబాబు తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఏం చేశాడు.. ఇలాంటి విషయాలు తెలియాలంటే దృశ్యం-2 సినిమా చూడాల్సిందే.

మలయాళంలో దృశ్యం-2 తెరకెక్కించిన జీతూ జోసఫ్‌ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. నదియా, నరేశ్‌, సంపత్‌ రాజ్‌, తనికెళ్ల భరణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది. దృశ్యం1 కంటే దృశ్యం-2 మరింత ఉత్కంఠ రేపుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.