డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్లో విషాదం

ఫిల్మ్ డెస్క్- ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ శ్రీని వైట్ల ఇంట్లో విషాదం నెలకొంది. శ్రీని వైట్ల కు పితృ వియోగం సంభవించింది. శ్రీను వైట్ల తండ్రి కృష్ణా రావు తూర్పు గోదావ‌రి జిల్లాలోని కందుల‌పాలెంలో ఉంటున్నారు. ఆయన వ‌య‌సు 83 ఏళ్లు. గ‌త కొన్ని రోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఈ నేపధ్యంలో ఆయ‌న ఆదివారం ఉద‌యం క‌న్నుమూశారు.

పలువురు సినీ ప్ర‌ముఖులు శ్రీను వైట్ల‌ను ఫోన్‌లో ప‌రామ‌ర్శిస్తున్నారు. వారి తండ్రి కృష్ణా రావు మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం కందులపాలెంలోనే కృష్ణా రావు అంత్యక్రియిలు జరగనున్నాయని తెలుస్తోంది.

sreenuvaitla 1

ప్ర‌స్తుతం శ్రీను వైట్ల, మంచు విష్ణుతో ఢీ అంటే ఢీ సినిమాను చేయ‌డానికి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. దర్శకుడిగా శ్రీను వైట్ల ఇండస్ట్రీలోని చిరంజీవి, మహేశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో సినిమాలు చేశాడు. శ్రీను వైట్ల ఢీ, రెడీ, దూకుడు వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను క్రియోట్ చేశారు.

ఆ తరువాత ఆగడు సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో శ్రీను వైట్లకు దర్శకుడిగా అనుకున్న మేరకు సినిమా అవకాశాలు రాలేదు. ఈ క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది. ఇదిగో ఇన్నాళ్ల తరువాత మంచు విష్ణుతో ఢీ అంటే ఢీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లాను హీరోయిన్‌ నటిస్తోంది.