అది విజయనగరంలోని గణపతిపురం ప్రాంతం. చింత సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి పైనాన్స్ వ్యాపారి. అలా బిజినెస్ చేసుకుంటూ కాలాన్ని వెల్లదీస్తున్నాడు. ఇక ఈ క్రమంలోనే విజయనగరం వైపు నుంచి బైక్పై గజపతినగరం వస్తున్నాడు. ఇంతలో రోడ్డుకు అడ్డంగా ఉన్న యువతి లిఫ్ట్ అడుగుతున్నట్లు అతనికి అర్ధమైంది. దీంతో పాపం.. వయసులో ఉన్న ఆడపిల్ల సాయం చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. సరే.. ఎక్కండి అంటూ బైక్ ఎక్కించుకున్నాడు.
అలా వెళ్తున్న క్రమంలోనే ఆ యువతి దిగాల్సిన ప్లేస్ వచ్చింది. ఈ సీన్ ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఇంతలోనే ఆ యువతి అనుకుంటున్న ప్లాన్ అమలు చేసేందుకు రెడీగా ఉంది. ఇక్కడ ఆపండి నేను దిగేస్తానంటూ అతనికి తెలిపింది. సరేనంటూ అతడు ఆపాడు. అంతే యువతి దిగిందో లేదో హఠాత్తుగా అతని మెడలో ఉన్న మూడున్నర తులాలు బంగారు చైన్ లాగేసుకుని పరారైంది. దీంతో అతను అరుపులు, కేకలతో పరుగులు పెట్టాడు.
దీంతో పక్కనున్న స్థానికులు ఈ సీన్ ను గమనిస్తునే ఉన్నారు. ఇక పరుగులు తీస్తున్న ఆ యువతిని పట్టుకుని ఆ బంగారు చైన్ అతనికి అప్పగించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. పాపం ఆడపిల్ల కాదా అని లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన ఇంత పనికి ఒడిగట్టిన యువతి లక్ష్మిపై ఇది వరకే అనేక దొంగతనం కేసులు ఉన్నట్లు పోలసులు తెలిపారు. ఈ యువతి వ్యవహార శైలీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.