డెలివరీకి భార్యని పుట్టింటికి పంపి .. భర్త మరో పెళ్లి! లాస్ట్ ట్విస్ట్ అదిరింది!

wife went for delivery

పెళ్లి అంటే ఓ పవిత్రమైన కార్యం. కానీ.., కొంత మంది ప్రబద్దులు మాత్రం పెళ్లిని కాసులు కురిపించే ఓ తతంగంగా చూస్తున్నారు. తమ గురించి నిజాలను దాచి.., కట్నం కోసం పెళ్లిళ్లు చేసుకుంటూ.. పెళ్లి విలువ తీస్తున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే పహాడీషరీప్ ప్రాంతంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ జావీద్ అనే వ్యక్తికి ఇది వరకే పెళ్లి అయ్యింది. అతని భార్య నిండు గర్భిణీ కావడంతో డెలవిరీ కోసం పుట్టింటికి వెళ్ళింది. అయితే.., మహమ్మద్ జావీద్ ఈ సమయంలో విలాసాలకి అలవాటు పడిపోయాడు. దీంతో.., పూర్తిగా అప్పులైపోయాడు. అవి తీర్చడానికి మహమ్మద్ జావీద్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. తనకి ఇంకా పెళ్లి కాలేదని ఓ సంపన్న కుటుంబాన్ని నమ్మించాడు. వారి కూతురిని పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చాడు. పెద్దలు ఇందుకు సమ్మతించడంతో పెళ్లి కార్డులు కూడా ప్రింట్ అయిపోయాయి. స్నేహితులు, బంధువులకి కూడా కొంత మందికి వెడ్డింగ్ కార్డ్స్ అందాయి.

delivery girlమొదటి భార్య స్నేహతురాలికి కూడా ఈ వెడ్డింగ్ కార్డు వెళ్ళింది. ఆమె ఈ కార్డు చూసి.., అసలు విషయం అతని భార్యకి చెప్పింది. తన భర్త తప్పు చేస్తున్నాడన్న విషయం భార్యకి అర్ధం అయ్యింది. వెంటనే తమకి ఇది పెళ్లి ఆయన విషయాన్ని, ఇప్పుడు తన భర్త వేసిన స్కెచ్ ని కొత్త పెళ్లి కూతురికి తెలిసేలా చేయగలిగింది. దీంతో.. అమ్మాయి తల్లిదండ్రులు పెళ్ళికి నిరాకరించి, దేహశుద్ది చేసి అతన్ని పహాడీషరీప్ పరిధిలోని పోలీసులకి అప్పచెప్పారు. రెండోసారి మూడు ముళ్ళు వేసి , అప్పముల నుండి బయట పడదాం అనుకున్న ప్రబుద్ధుడికి మంచి శాస్తి జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.