భర్తను గొడ్డలితో నరికిన భార్య.. ఎందుకంటే..?

భార్యాభర్తల మధ్య రగిలే గొడవలకు కొందరు ఎంతకైన తెగిస్తున్నారు. చిన్నపాటి వివాదాలను చర్చించుకోకుండా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు జీవితాలను ఆగం చేసేలా చేస్తున్నాయి. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఓ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. పూర్తి వివరాల్లో వెళ్తే.. అది తాళ్లరేవు మండలం గాడిమొగ పంచాయతీలోని లక్ష్మీపతిపురం గ్రామం. అప్పారావు-దేవి ఇద్దరు భార్యాభర్తలు. గత పదేళ్ల కిందట వీరికి వివాహం జరిగింది. ఓ కుమారుడు, కూతురు కూడా ఉన్నారు. కొన్నాళ్ల పాటు వీరి వివాహ జీవితం అన్యోన్యంగానే సాగింది.

ఇక పిల్లలతో పాటు హాయిగా సాగుతున్న వీరి కాపురంలో భార్య చేసిన పనికి పిల్లలు అనాధలుగా మారారు. ఇక విషయం ఏంటంటే..? అప్పారావు తల్లితో పాటు తన చెల్లెని, కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక భార్య మాత్రం నిత్యం వేరే కాపురం పెడదామని భర్తకు సూచిస్తూ ఉండేది. దీంతో భర్త కుటుంబంలో ఉన్నది ఒక్కడినేనని, అమ్మ, చెల్లిని చూసుకోవాలంటూ భార్య సూచనలను తిరస్కరించేవాడు. దీంతో ఇదే విషయమై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు తలెత్తాయి.

దీంతో కోపంతో భార్య కొన్నాళ్ల పాటు పుట్టింట్లోనే ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగొచ్చిన భార్య భర్త ముందు కాస్త సర్ధుకున్నట్లు వ్యవహరించింది. ఈ నేపథ్యంలోనే భర్త స్థానిక రొయ్యల కంపెనీలో పని చేసేవాడు. దీంతో ఆయనను ఉన్నట్టుండి ఆ కంపెనీ నుంచి తొలగించారు. ఈ తరుణంలో ఆర్థికంగా వారి కుటుంబానికి కష్టాలు ఎదురయ్యాయి. ఇక భర్త భార్యను కూలీకి వెళ్లాలంటూ చెప్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఓ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో తల్లీ,చెల్లి పనికి వెళ్లారు. ఈ క్రమంలో నిద్రిస్తున్న భర్తపై భార్య దేవి తలపై గొడ్డలితో దారుణంగా హత్యచేసింది.

Wife Hacks Husband to Death in East Godavari District - Suman TVదీంతో వెంటనే అక్కడి నుంచి పరారైంది. ఇక పిల్లలు నిద్రలేచి చూసేసరికి తండ్రి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఒక్కసారిగా షాక్ కు గురైన పిల్లలు ఏడుస్తూ పరుగులు పెట్టారు. ఇక స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న భార్య కోసం గాలిస్తున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక అతని భార్య దేవి చేసిన దారుణ ఘాతుకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.