విమానంలో ఆ స్టార్ యాంకర్ కి అవమానం! బిజినెస్‌మెన్‌ పాడుబుద్ది!

flight

విమానంలో ప్రయాణిస్తున్న ప్రముఖ టీవీ యాంకర్‌తో ఓ వ్యాపార వేత్త అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యాపారవేత్తను అరెస్ట్‌ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్టోబర్‌ 3న ఢిల్లీ నుంచి ముంబై వెళ్లిన విమానంలో యాంకర్‌, వ్యాపారవేత్త ప్రయాణించారు. విమానం ల్యాండ్‌ అయిన తర్వాత తన లగేజ్‌ తీసుకునేందుకు సీటు లొంచి లేచి యాంకర్‌ నిలబడింది. ఈ సమయంలో పక్కన సీట్‌లో ఉన్న వ్యాపారవేత్త ఆమె నడుమును గట్టిగా పట్టుకుని, ఒళ్లోకి లాక్కున్నాడు. ఈ ఘటనతో షాక్‌ తిన్న యాంకర్‌, ఒక్కసారిగా ప్రతిఘటించింది.

మగవ్యక్తి అనుకుని పట్టుకున్నానని, సారీ చెప్పాడు. ఇంటికి వెళ్లిన తర్వాత తనకు జరిగిన విషయాన్ని యాంకర్‌ ఆ ఎయిర్‌లైన్స్‌ కంపెనీకి ఈ మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేసి, ఆ వ్యాపారవేత్త వివరాలు ఆడిగింది. అతని వివరాలు ఇచ్చేందకు ఎయిర్‌లైన్స్‌ సంస్థ అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ఆమెకు సూచించింది. అక్టోబర్‌ 4న యాంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్తను అరెస్ట్‌ చేసి, కోర్టులో హాజరుపర్చారు. ఈ విషయంపై యాంకర్‌ ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.