సమాజంలో ఆడవారిపై వేధింపులు ఆగడం లేదు. సామాన్యులు మాత్రమే కాక సెలబ్రిటీలు కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నారు. ఇక తాజాగా నటి ఐశ్వర్య తనకు ఎదరవుతున్న వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. ఆ వివరాలు..
సమాజంలో ఆడవారి మీద చోటు చేసుకుంటున్న నేరాలు.. ఏమాత్రం తగ్గడం లేదు. ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చినా మార్పు రావడం లేదు. ఇలా వేధింపులు ఎదుర్కొంటున్నవారిలో సామాన్యులు మాత్రమే కాక.. సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. ఇక తాజాగా నటి ఐశ్వర్య భాస్కరన్ తాను కూడా ఇలాంటి వేధింపులకు గురవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇంతకు ఐశ్వర్య ఎవరూ అంటే.. సీనియర్ నటి లక్ష్మి కుమార్తె. తల్లిలానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. టాలీవుడ్, కోలివుడ్‌లో పలు తెలుగు సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య. అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, నాని, కళ్యాణ వైభోగం, ఓ బేబీ వంటి చిత్రాల్లో నటించి.. ఈ తరం ప్రేక్షకులకు చేరువయ్యింది ఐశ్వర్య.
ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఓ వీడియో సంచలనాలు సృష్టిస్తోంది. తాను ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఈ వీడియోలో వెల్లడించింది. చాలా మంది పురుషులు తనకు అసహ్యకర మెసేజ్‌లు పంపిస్తుండటం.. తనలో మెంటల్ ట్రామాకు దారితీసిందన్న ఐశ్వర్య.. కూతురు సలహా మేరకు ఈ సమస్య గురించి ఓపెన్‌గా మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.
ప్రసుత్తం తనకు సినిమా అవకాశాలు ఎక్కువగా రాకపోవడంతో.. సోప్ బిజినేస్ చేస్తున్నట్లు తెలిపింది ఐశ్వర్య. ఇక వ్యాపారం కోసం తాను తన వ్యక్తిగత ఫోన్ నంబర్‌ని సోషల్ మీడియాలో షేర్ చేశానని.. కానీ కొందరు మగాళ్లు.. దీన్ని అవకాశంగా తీసుకుని.. తనకు అసభ్యకర ఫొటోలు పంపుతూ.. వేధిసుతన్నారని తెలిపింది. కస్టమర్స్ నుంచి ఆర్డర్స్ తీసుకోవడం కోసం తాను నంబర్‌ను షేర్ చేశానని.. కానీ కొందరు దీన్ని అవకాశంగా తీసుకుని.. తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది ఐశ్వర్య.
సోషల్ మీడియాలో తన నంబర్ షేర్ చేసిన దగ్గర నుంచిఅనుచిత సందేశాలు, అసభ్యకర ఫొటోలు పంపిస్తున్నారని తెలిపింది. కొంతమంది పురుషులు ప్రైవేట్ పార్ట్స్ ఫొటోలు కూడా షేర్ చేస్తుండటంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయినట్లు చెప్పుకొచ్చింది ఐశ్వర్య. ఇందుకు సంబంధించిన వివరాలును తన తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో ద్వారా పంచుకుంది ఐశ్వర్య. తాను సైబర్ క్రైమ్‌కు వెళ్లాలని కోరుకోవడం లేదని, కానీ ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వీడియో ద్వారా హెచ్చరించింది ఐశ్వర్య.
ఇక లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లుగా వీడియో షేర్ చేసిన తర్వాత చాలా మంది నెటిజనులు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలిచారు.. ధైర్యంగా ఉండమని చెప్పారు. అభిమానులు తనపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపింది ఐశ్వర్య. ఐశ్వర్య దక్షిణాదిలో తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె ప్రముఖ సీనియర్ నటి లక్ష్మి కూతురు. 1996లో భర్తతో డివోర్స్ తీసుకున్నప్పటి నుంచి తన కుమార్తెతో కలిసి జీవిస్తోంది ఐశ్వర్య.
ఇక ‘అడవిలో అభిమన్యుడు చిత్రం’ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య.. ఆ తర్వాత ‘మామ గారు’, ‘సీతాకోక చిలుకలు’, ‘నరసింహం’ తదితర హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. అంతేకాదు ‘గార్డిష్’ అనే హిందీ సినిమాలోనూ నటించిన ఐశ్వర్య.. ప్రస్తుతం ఒక యూట్యూబ్ చానెల్ రన్ చేస్తోంది. దీనిలో వెగాన్ వంటకాల తయారీ, సబ్బుల తయారీ, ఆధ్యాత్మికత అంశాల గురించి వివరిస్తుంటుంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.