బాలిక హత్యాచార ఘటన: ఏడ్చేసిన పవన్‌కళ్యాణ్‌.. వాడ్ని ఉరి..

pawankalyan chaitra rapecase saidabad

సైదాబాద్‌లోని సింగరేణి కాలనీలో గిరిజన బాలిక హత్యాచార ఘటనపై రాష్ట్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. కాగా జనసేన అధినేత, హీరో పవన్‌ కళ్యాణ్‌ బాలిక హత్యాచార ఘటన గురించి తెలియగానే కన్నీళ్లు పెట్టుకున్నారని ఆయన గబ్బర్‌సింగ్‌ సినిమాలో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్టు ఒక తెలిపారు. ఆ సినిమాలోని అత్యాక్షరి సీన్లతో బాగా పాపులర్‌ అయిన నటులు బుధవారం బాలిక కుటుంబసభ్యులను పరామర్శించి మాట్లాడు. అనంతరం స్పందిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని వదిలిపెట్టొదని పోలీసులకు సూచించారు. సినిమాల్లో రౌడీలుగా నటించామని నిజజీవితంలో అలాగే ఉండి ఉంటే వాడ్ని మేమే ఉరి తీసే వాళ్లమని అన్నారు.