ప్రియుడి మైకంలో ఆంటీ.. కన్న పిల్లలపై కనికరం లేకుండా..!

2 Babies Found Dead

వివాహతేర సంబంధాలు భార్యాభర్తల వివాహ బంధాన్ని తెంచేస్తున్నాయి. ఇలా ఇప్పటికి ఎంతోమంది తెర చాటు సంసారాల్లో వేలు పెట్టి నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాష్ట్రంలోని మండీ ప్రాంతంలో హీనా అనే యువతి ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లకు వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయితే గత కొంత కాలం నుంచి హీనా భర్తను కాదని మరో వ్యక్తితో పరిచయం ఏర్పరుచుకుంది. ఈ పరిచయమే వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఇక కొన్నాళ్లకు పిల్లలను, భర్తను కాదని హీనా ప్రియుడితో లేచిపోయింది. భర్త సాయంతో పోలీసులు రంగంలోకి దిగి ఇంటికి తీసుకొచ్చారు. కొన్ని రోజులు బాగానే ఉన్నా హీనా భర్తతో ఉండలేక ఇద్దరు పిల్లలను తీసుకుని మళ్లీ అతడితో వెళ్లిపోయింది. భర్త కొన్ని రోజులు వెతికే ప్రయత్నం చేసిన ఎక్కడ కూడా ఆ మహిళ కనిపించలేదు. ఇక కొంత కాలానికి పోలీసుల కంట పడింది హీనా. ఇక కుటుంబ సభ్యులను పిలిచి వారి సమక్షంలో పిల్లలేరని ప్రశ్నించేసరికి హీనా దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.

ఇద్దరు పిల్లలు లేరని వారిని ఓ లోయలో పడేసి చంపేశానని తెలిపింది. దీంతో భర్త కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలు హీనాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇక హీనా చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.