కట్టుకున్న భార్యను అమ్మేసి వదినతో వెళ్లిపోయిన భర్త

Rajasthan

ఈ మధ్యకాలంలో చట్టానికి తూట్లు పొడుస్తూ అనేక మంది తల్లిదండ్రులు మైనర్ బాలికలకు పెళ్లిళ్లు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ఇదే అవకాశాన్ని అందుకున్న నవ వరుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకున్నానంటూ సంబరపడిపోతాడు. కానీ రాజస్థాన్ లో ఓ యువకుడు మాత్రం వింతగా ఆలోచించాడు. మైనర్ బాలికతో సంసారం చేయడానికి ఇష్టం లేక వరసకు వదినైన ఓ మహిళతో ఏకంగా మైనర్ భార్యను అమ్మేసుకున్నాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లో ఓ యువకుడికి గత కొన్ని రోజుల కిందట మైనర్ బాలికతో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. కొంత కాలం భర్త ఎలాంటి వివాదాలు లేకుండా మైనర్ బాలికతో సంసారం చేశాడు. రోజులు గడిచేకొద్ది తన భార్యపై ఇష్టం తగ్గిపోయింది. ఈ క్రమంలోనే వరసకు వదినతో కలిసి పెళ్లి చేసుకున్న భార్యను అమ్మేందుకు ఇద్దరు సిద్దమయ్యాడు. దీనికి వదిన కూడా సిద్దపడింది. దీంతో సమయం చూసుకుని తన మైనర్ బాలికను ప్లాన్ ప్రకారం కొందరి వ్యక్తులు అమ్మేశారు.

Rajasthan

అమ్మగా వచ్చిన డబ్బులతో ఆ భర్త వదినతో పాటు వెళ్లిపోయాడు. అలా మైనర్ బాలికపై కొన్న వ్యక్తితో పాటు అతని స్నేహితులు అత్యాచారానికి దిగారు. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఆ మైనర్ భార్య తల్లిదండ్రులకు తెలిసింది. ఇక విషయం తెలుసుకున్న ఆ బాలిక తల్లిదండ్రులు మా కూతురిని కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు సమాచారం అందించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో షాక్ ల మీద షాక్ లు తగిలాయి. ఇక ఎట్టకేలకు నిందితులైన భార్యాను అమ్మిన భర్తను, మైనర్ భార్యను కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.