దారుణం : భర్త ముందే.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై..

దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. లైంగిక దాడులు.. అత్యాచారాలు.. చివరికి హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంతో ఊగిపోయి దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే మొన్నటి వరకు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలను చూస్తే చాలు కామాంధులు రెచ్చిపోయి అత్యాచారాలకు పాల్పడేవారు.

rape t minతాజాగా గుంటూరు జిల్లాలో ఓ మ‌హిళ‌పై కొంత‌మంది దుండ‌గులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. మేడికొండూరు మండ‌లంలోని పాల‌డుగులో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. బుధ‌వారం రాత్రి గుంటూరులోని ఓ వివాహానికి హాజ‌రయ్యి బైక్ వ‌స్తున్న భార్య‌, భ‌ర్త‌ల‌ను మేడికొండూరు మండ‌లంలోని అడ్డ‌రోడ్డు వ‌ద్ద దుండగులు అడ్డుకున్నారు. ఎదురు తిరిగిన భర్తను భార్య ముందే చితక బాదారు. ఇక ఆ మహిళ ను క‌త్తుల‌తో బెదిరించి పోలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అంతే కాదు ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలు కూడా ఎత్తుకు వెళ్లారు.

ఈ ఘటనపై మేడికొండూరు పోలీస్ స్టేషన్‎లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే, సంఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతం గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ప‌రిధిలోకి వ‌స్తుందని, త‌మ‌ది రూర‌ల్ ప్రాంతంలో ఉన్న స్టేష‌న్ అని పోలీసులు చెప్పిన‌ట్టు బాధితురాలు పేర్కొన్న‌ది. దిశా చ‌ట్టం అమ‌ల్లోకి తీసుకొచ్చినా మ‌హిళ‌ల‌పై ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే . రాష్ట్రంలో ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగినా జీరో ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి ఆ ప‌రిధిలోకి వ‌చ్చే పోలీస్ స్టేష‌న్‌కు బ‌దిలీ చేయాల‌నే ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ పోలీసులు ఇలా చేయ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి.