ఈ రోజుల్లో వివాహం బంధానికి విలువల లేకుండా పోతోంది. అక్రమ సంబంధాలు కానివ్వండి.. దొంగ పెళ్లిళ్లు కానివ్వండి. చివరకు మచ్చ అయితే పెళ్లిమీదే పడుతోంది. ఒక్క అమ్మాయి దొరికితే చాలు అని ఎందరో ఎదురుచూస్తుంటే.. ఈ మహానుభావుల్లాంటి వాళ్లు ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలుగురిని పెళ్లాడిన ఈ నిత్య పెళ్లికొడుకు మళ్లీ ఐదో వివాహానికి రెడీ అయిపోయాడు.
అసలు కథేంటంటే.. విశాఖ జిల్లాలో సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్‌గా చేస్తున్న అప్పలరాజుదే ఈ కథ. అతను ఒకరికి తెలీకుండా మరొకరిని వివాహమాడాడు. అలా ఏకంగా నలుగురితో వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నాడు. అతనికి ఐదుగురు పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నవాళ్లు చాలదన్నట్లు ఇప్పుడు ఐదో వివాహానికి సిద్ధమైపోయాడు. అతనికి భార్యల్లో ఒకరైన పద్మ అనే మహిళకు ఇప్పటికే నాలుగుసార్లు అబార్షన్ చేయించాడని సమాచారం. అతను అన్నిసార్లు అబార్షన్ చేయించడం.. అతని ప్రవర్తనలో మార్పు రావడంతో పద్మ అతనిని గమనించడం ప్రారంభించింది. ప్రత్యేక నిఘా పెట్టడంతో అసలు సంగతి బయటపడింది.
మరో మహిళా కానిస్టేబుల్‌లో ఐదో వివాహానికి రెడీ అయ్యాడని తెలుసుకుని పద్మ నిలదీసింది. ఆమెను బెదిరిచండంతో మహిళా సంఘాలను ఆశ్రయించింది. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలంటూ దిశ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీసీఆర్బీ హెడ్ కానిస్టేబుల్ అప్పలరాజుపై దిశ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ అందరూ ఊహించిందేనా? అసలు కారణాలు ఇవే!