నిర్మల్ జిల్లాలో దారుణమైన ఘటన.. 3 ఏళ్ల బాలికపై 50 ఏళ్లు కామంధుడు పాడు పని!

police

అమ్మాయిలపై అత్యాచార దారుణాలు రోజు రోజుకు సంచలనంగా మరుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన చట్టాలు తెల్చినా కామాంధుల ఆలోచనల్లో మాత్రం అస్సలు మార్పు రావటం లేదు. ఇటీవల సైదాబాద్ లోని ఆరేళ్ల చిన్నారి ఘటన మరువకమందే రాష్ట్రంలో మరో ఘటన దడ పుట్టిస్తుంది. ఇక పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈదిగాంలో 50 ఏళ్ల వ్యక్తి కామంతో కళ్లు మూసుకుని ప్రవర్తించాడు. ఇక జిల్లా కేంద్రంలోని ఓ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై కన్నేశాడు.

రోడ్డు పక్కన ఆడుకుంటున్న బాలికకు ఆ దుర్మార్గుడు చాక్లెట్ ఆశ చూపాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారి నిజమేనని ఆశ పరిగెత్తింది. దీంతో ఆ బాలికను ఆపహరించి స్థానిక ఫంక్షన్ హాల్ సమీపంలో ఆ బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి ఏంటని ప్రశ్నిస్తే వచ్చి రాని మాటలతో ఖంగుతినే సమాధానాలు చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు. మూడేళ్ల చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.