బ్రేకింగ్ న్యూస్! బాబా కా డాబా తాత ఆత్మహత్యాయత్నం

baba ka dhaba

దేశ రాజధానిలో ఉండే బాబా కా డాబా కాంత ప్రసాద్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఢిల్లీలోని సౌత్ జోన్ మాలవీయనగర్‌ ప్రాంతంలో కాంతా ప్రసాద్‌, బాదామీ దేవి దంపతులు చిన్న డాబాని నడిపేవారు.ఉద్యోగులు, కార్మికులు, కూలీలు వీరి వద్ద టిఫిన్ చేసేవారు. లాక్ డౌన్ వరకు అంతా బాగానే నడిచింది. కానీ.., లాక్ డౌన్ లో వీరి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. లాక్ డౌన్ ఓపెన్ అయ్యాక కూడా ప్రజలు వీరి డాబాకి రాలేదు. ఇలాంటి సమయంలో వీరిని ఫుడ్ బ్లాగర్ గౌరవ్‌ వాసన్ ఆదుకున్నాడు. వీరి పరిస్థితిని వివరిస్తూ తన ఛానెల్ లో బాబా కా డాబా గురించి ఓ వీడియోని అప్లోడ్ చేశాడు. అంతే.., బాబా కా డాబా దంపతులు కొన్ని రోజుల్లోనే దేశ విదేశాల్లో ఫేమస్ అయిపోయారు. వీరికి విరాళంగా లక్షలు వచ్చి పడ్డాయి. ఈ డబ్బు విషయంలోనే బాబా కా డాబా కాంత ప్రసాద్ గతంలో గౌరవ్‌ వాసన్ కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.

baba ka dhaba deathకాంతా ప్రసాద్‌ కి ఆ సమయంలో రూ.5 లక్షల పైనే డబ్బు అందింది. దీంతో.., వీరి కష్టాలు తీరిపోయినట్టే అని అంతా అనుకున్నారు. కానీ.., ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.. బాబా కా డాబా కాంత ప్రసాద్ ఆత్మహత్యకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స అందుకుంటున్నాడు. మద్యంలో నిద్ర మాతలు వేసుకుని తాగడంతో ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. తనకి విరాళాల రూపంలో రూ.5 లక్షల పైనే డబ్బు రావడంతో కాంత ప్రసాద్ ఓ రెస్టారెంట్ ని ప్రారంభించారు. కానీ.., ఆయన ప్రారంభించిన రెస్టారెంట్ సరిగా నడవలేదు. పైగా.., కొత్త ఆర్థిక కష్టాల్ని తెచ్చిపెట్టింది. దీంతో.., ఆ రెస్టారెంట్ ని నడపడం ఆయనకి భారంగా మారింది. పైగా.., విరాళాలుగా వచ్చిన డబ్బు అంతా అయిపోయింది. దీంతో రెస్టారెంట్ మూసేసి మళ్లీ పాత డాబాకే మారారు ఆ దంపతులు. ఇలా.. దేవుడు బాగా బతకడానికి అవకాశం కల్పించినా చేజార్చుకున్నాను అనే బాధలోనే బాబా కా డాబా కాంత ప్రసాద్ సూసైడ్ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.