దేశ రాజధానిలో ఉండే బాబా కా డాబా కాంత ప్రసాద్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. ఢిల్లీలోని సౌత్ జోన్ మాలవీయనగర్ ప్రాంతంలో కాంతా ప్రసాద్, బాదామీ దేవి దంపతులు చిన్న డాబాని నడిపేవారు.ఉద్యోగులు, కార్మికులు, కూలీలు వీరి వద్ద టిఫిన్ చేసేవారు. లాక్ డౌన్ వరకు అంతా బాగానే నడిచింది. కానీ.., లాక్ డౌన్ లో వీరి వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. లాక్ డౌన్ ఓపెన్ అయ్యాక కూడా ప్రజలు వీరి డాబాకి రాలేదు. […]