పెట్రోల్‌ ధర కంటే విమానంలో పోసే ఇంధనం ధర తక్కువ

Bikes and Small Airplane - Suman TV

రోజురోజుకు పెట్రోల్‌ రేటు భారీగా పెరిగిపోతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలపై పెట్రోల్‌ ధరలు అధిక భారాన్నే మోపుతున్నాయి. పెట్రోల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ పలుచోట్ల తమ సొంత వాహనాలను తగలబెట్టారు కొంతమంది. అలాగే సోషల్‌ మీడియా కూడా ధరల పెరుగుదలపై తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. పెట్రోల్‌ మూల ధర కంటే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున​ పన్నులే అధికంగా ఉన్నాయి. పెట్రోల్‌ ధర రూ.100 ఎప్పుడో దాటేసి దాదాపు రూ.112 కు చేరుకుంది. దీంతో ప్రస్తుతం పెట్రోల్‌ రేటు విమానాల్లో పోసే ఎయిర్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ ధర కంటే అధికంగా ఉందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bikes and Small Airplane - Suman TVవాస్తవానికి విమానం నడిచేందుకు వాడే ఇంధనం ధర సుమారు రూ.83 మాత్రమే ఉండగా సాధారణ ద్విచక్రవాహనం నడిచేందకు వాడే పెట్రోల్‌ ధర అధికంగా ఉంది. ఈ రెండు ఇంధనాల ధరలను పోల్చుతూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ భారీగా వైరల్‌ అవుతున్నాయి. ఇక బైకులు అమ్మేసి చిన్నపాటి విమానం కొనుక్కొవడం మేలు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విపరీతంగా పెరిగిపోతున్న పెట్రోల్‌ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.