పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యులు సతమతం అవుతున్నారు. కూరగాయాలు మొదలు కోలుకుని వంట నూనెకు ఇటీవల అన్ని ధరలు ఆకాశాన్ని వైపు చూస్తున్నాయి. ఈక్రమంలో కోన్ని రోజుల క్రితం గోధమల ధరలు కూడా పెరిగాయి. తాజాగా ఈ జాబితాలో చేరేందుకు చక్కెర రెడీ అవుతుంది. అయితే పంచదార ధరలు అదుపులో ఉంచేందుకు కేంద్రం తక్షణ చర్యలకు ఉపక్రమించవచ్చని తెలుస్తోంది. ఒకవేళ చక్కెర ధరలు పెరిగితే.. అది ప్రజలపై మరో భారంపడినట్లే..
మన దేశంలో వార్షిక చక్కెర ఉత్పత్తి సామర్థ్యం 35.5 మిలియన్ టన్నులు. ఇందులో 9.5 మిలియన్ టన్నుల చక్కెరని ఈ ఏడాది ఎగుమతి చేయోచ్చని ముందుగా అంచనా వేసి ఆ మేరకు అనుమతులు జారీ చేశారు. అయితే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వివిధ దేశాల్లో చక్కెరకు డిమాండ్ పెరిగింది. దీంతో భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. ఇదే కొనసాగితే మన దేశంలో ఉన్న చక్కెర అంతా విదేశాలకు తరలి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా చక్కెర ఎగుమతులపై కేంద్రం పరిమితి విధించవచ్చని సమాచారం.
ఇదీ చదవండి: భరత నాట్యాన్ని.. హిప్ హాప్ తో మిక్స్ చేసి అదరగొట్టారు!ప్రస్తుత మార్కెట్‌లో చక్కెర కిలో ధర సుమారు రూ.42 దగ్గర ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక ఎగుమతులపై పరిమితి విధిస్తే రాబోయే రోజుల్లో కూడా చెక్కెర రూ.40-43 మధ్యనే ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. అలాకాని పక్షంలో గోదుమల తరహాలోనే చక్కెర ధరలకు రెక్కలు వచ్చే ప్రమాదం ఉంటుందని వ్యాపారవర్గాలు తెలిపాయి. ఈక్రమంలో చక్కెర ఎగుమతులపై నిషేధం వార్తలు బటయకు రావడంతో స్టాక్ మార్కెట్‌లో చక్కెర కంపెనీల షేర్ల ధరలు పడిపోయాయి. మరి చెక్కెర ధరలు పెరుగుతాయి అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.