వర్మతో అషూ రెడ్డి బోల్డ్ వీడియో చూసిన ఆమె తల్లి రియాక్షన్- వీడియో

ఫిల్మ్ డెస్క్- ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు తన రూటే సపరేటు అంటున్నారు. వెండితెరను వదిలిపెట్టి, వెబ్ సిరీస్, యూట్యూబ్ సిరీస్ ఇంటర్వూలతో బిజీగా మారారు ఆర్జీవి. ఒకప్పుడు మీడియా అంతా రాంగోపాల్ వర్మ ఇంటర్వూల కోసం ఎగబడితే, ఇప్పుడు వర్మ యాంకర్ల ఇంటర్వూల కోసం పాకులాడుతున్నారు. అవును మొన్న అరియానా ఇంటర్వూ చేసిన ఆర్జీవి, తాజాగా అషూ రెడ్డి ఇంటర్వూ చేశారు.

అలా అని న ఇంటర్వూ మాములుగా చేస్తే అది వర్మ అందుకవుతాడు, శృంగారాన్ని మిక్స్ చేసి సరదా సరదా ఇంటర్వూలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు వర్మ. అషూ రెడ్డి ఇంటర్వ్యూకి సంబంధించి ఇప్పటికే రెండు ప్రొమోలను రిలీజ్ చేశారు వర్మ. ఈ ప్రోమోల్లో విభిన్నమైన కోణాల్లో ఆషు అందాలను చూపించారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు సైతం ఎంతో బోల్డ్‌గా ఉన్నాయి. మీరు అశ్లీల చిత్రాలు చూస్తారా అని అషూ రెడ్డిని డైరెక్ట్‌గా అడిగేశారు రాంగోపాల్ వర్మ.

Ashu Reddy With her Mother 2

ముందు కాస్త మొహమాట పడిన అషు ఆ సమాధానం చెప్పేందుకు వెనుకడుగు వేసింది. కానీ వర్మ వదలరు కదా.. చివరికి ఆమె చేత సమాధానం చెప్పించారు. నా ఫ్రెండ్స్ చూస్తారు కానీ నేను చూడను అని తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమెను మాటల్లో పెట్టి నిజం రాబట్టారు ఆర్జీవి. ఇంకేముంది చివరికి తాను కూడా అశ్లీల చిత్రాలను చూస్తాననిచెప్పింది అషూ రెడ్డి. ఇక ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏటంటే.. ఇలాంటి బోల్డ్ ఇంటర్వూలను ఇంట్లో పేరెంట్స్ కు చూపించాలంటే కాస్త ఇబ్బందికరమగా ఉంటుంది.

కానీ ఇలాంటి ఇంటర్వ్యూ చేసినందుకు అషూ రెడ్డి తల్లి ఎలా రియాక్ట్ అయ్యారు అనే విషయాన్ని కూడా రాంగోపాల్ వర్మ స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చూపించారు. రాంగోపాల్ వర్మతో అషు చేసిన ఈ పనిని ఆమె తల్లి మెచ్చుకున్నారు. ఇంటర్వ్యూ బాగుందని, బోల్డ్‌గా, స్ట్రాంగ్‌గా ఉందని ఆమె అన్నారు. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉందని తన కూతురు అషూ రెడ్డిని పొగిడింది ఆమె తల్లి. ఆ వీడియోను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. మరి మీరు కూడా చూసెయ్యండి.