అనిల్ తో పెళ్ళికి మా నాన్న ఒప్పుకోలేదు.. తన “లవ్ స్టోరీ” బయటపెట్టిన షర్మిల

తెలంగాణలో ‘వైఎస్సార్ టీపి ’ని స్థాపించిన వైఎస్ షర్మిల తాజాగా ఓ మీడియాలో మాట్లాడుతూ.. పలు అంశాలు చర్చించారు. తాను ఓ మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చానని, తాను ఒంటరినని భావించడం లేదని స్పష్టం చేశారు. తన తండ్రి ఇచ్చి స్ఫూర్తితో ఆయన కూతురిగా ప్రజల్లో తనకు విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సోదరుడు ఏపీ సీఎం జగన్ గురించిన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు.

aygr minఇక రాజకీయాల్లోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది.. మీరు ఇప్పుడు ఎనర్జీగా ఉన్నారా.. అసలు రాజకీయాల్లోకి వస్తాను అనగానే మీ భర్త అనిల్ కుమార్ రియాక్షన్ ఏంటీ అన్న ప్రశ్నకు సమాధానంగా.. నేను రాజకీయాల్లోకి వస్తాను అనగానే నాకు ఎలాంటి అడ్బు చెప్పలేదని.. ఆయన ఎన్నడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. ప్రొఫెషనల్ గా ఆయన తన పనులు తాను చేసుకుంటూ ఓ మంచి భర్తగా.. తండ్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అన్నారు. అసలు మీరుద్దరూ ఎప్పుడు లవ్ లో పడ్డారు.. మీరు మొదట ఎక్కడ కలుసుకున్నారన్న ప్రశ్నకు సమాధానంగా.. తామిద్దరం సికింద్రాబాద్ వద్ద ఓ ధాబాలో కలిశామని, మిత్రులతో కలిసి వెళ్లినప్పుడు పరిచయం ఏర్పడిందని వివరించారు. అప్పుడు తాను చదువుకుంటున్నానని, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పలేనని అన్నారు.

ggashe minతనని ఎక్కువగా అనీల్ నన్ను కలిసేవారు.. ఆయనే మొదట తన లవ్ ప్రపోజల్ చేశారని చెప్పారు. అయితే ఇంట్లో మొదట చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. నాన్నగారు పెళ్లికి అభ్యంతరం చెప్పారని.. వాళ్లు బ్రహ్మిణులు.. వారి సాంప్రదాయలు.. పద్దతులు వేరుగా ఉంటాయని నువ్వు అక్కడ ఇమడలేవని అన్నారు. ఇప్పుడు బాగానే ఉంటుంది.. కానీ భవిష్యత్ లో ఇబ్బందులు ఎదుర్కొంటావని అన్నారు. కానీ నేను మాత్రం గట్టి పట్టదలతో ఉన్నాను.. అనుకున్నది సాధించానని అన్నారు. మొత్తానికి ఇప్పుడు తమ వైవాహిక జీవితం ఎంతో సంతోషకరంగా గడుపుతున్నానని షర్మిల వెల్లడించారు. అలా తన “లవ్ స్టోరీ”ని బయటపెట్టారు వైఎస్ షర్మిల.