రోజుకో ప్రభుత్వాధికారిలా మారి.. మోసం చేస్తున్న కిలాడీ వాలంటీర్..!

Volunteerinap

ఏపీలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థకు దేశవ్యాప్తంగా మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. కరోనా సమయంలో ప్రజలకు సేవలు చేస్తూ మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభుత్వ అందించే సంక్షేమ పథకాలు అందడంలో వాలంటీర్ల దే కీలక పాత్ర. అయితే కొందరు వాలంటీర్ చేసే మోసాలు ఆ వ్యవస్థకి చెడ్డ పేరు తెస్తున్నాయి. తాజాగా ఓ వాలంటీర్ రోజూకో ప్రభుత్వ అధికారి లా జనాలను నమ్మించి దొరికిన కాడికి దొచుకున్నాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడులో చేటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రకాశం జిల్లా కురిచేడులో అఖిల్ అనే వ్యక్తి వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. చేసేది వాలంటీర్ పని అయినా అవసరమైనప్పుడు కలెక్టర్ అవుతాడు. మరోసారి ఎమ్మార్వో, పోలీసు ఇలా ఉన్నతాధికారులుగా మారిపోతాడు. విధి నిర్వహణలో భాగంగా ఆయా కార్యాలయాలకు వెళ్లిన సమయంలో అధికారుల సీట్లలో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చాడు. పంచాయతీ కార్యదర్శి సీటులో కూడా కూర్చున్నాడు. ఆ పదవులు అడ్డు పెట్టుకుని అందిన కాడికి డబ్బులు గుంజుతాడు. గతంలో పింఛన్ ఇస్తానని రూ.2.5 లక్షలూ దోచుకున్నాడు. తాజాగా కురిచేడు పీఎస్ లో ఎవరూ లేని టైం లో ఎస్సైగా అవతారమెత్తాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

2018లో రాజమండ్రిలో ఓ మహిళతో కలిసి సబ్ కలెక్టర్ పేరుతో బంగారు షాపు వారిని బురిడీ కొట్టించే యత్నం చేశాడు. షాపు సిబ్బంది అనుమానించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దొరికిపోయాడు. ఆ సమయంలో వాలంటీర్‌పై కేసు కూడా నమోదైనట్లు సమాచారం.ఇతడి అతి తెలివి చూసిన స్థానికులు నవరస నటసార్వభౌమ నట విశ్వరూప నటబీభత్సం అంటూ వ్యంగ్యంగా పిలుస్తున్నారు. మరి.. ఇలాంటి కిలాడి వాలంటీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.