రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అంటే సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా చెప్పుకుంటారు. ఎలాంటి కేసు అయినా.. వెనుక ఎంత పెద్ద మనుషులు ఉన్నా సరే ఏమాత్రం లెక్కచేయకుండా తన విధులు నిర్వహించి అందరిచే షెభాష్ అనిపించుకున్నారు. పదవి విరమణ అనంతరం పలు సేవ కార్యక్రమలో, పలు సంస్థలు నిర్వహించే వ్యక్తిత్వ వికాస పోగ్రామ్స్ పాల్గొన్ని విద్యార్థులకు,యువకులకు మంచి సందేశాలు ఇస్తుంటారు. అలా నిత్యం మనకు కనిపించే ఈ సీబీఐ మాజీ జేడీ కొడవలి చేత పట్టి కనిపించారు. అది ఎక్కడ, ఎందుకు అనే విషయం తెలుసుకోవాలంటే మీరు ఇంకాస్త ముందుకు వెళ్లి చదవాలి.

image 0 compressed compressedసీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పదవీవిరమణ అనంతరం రాజకీయాలపై ఆసక్తితో జనసేన పార్టీలో చేరారు. అయితే అక్కడ తను ఇమడలేక పార్టీ నుంచి బయటకి వచ్చారు. అనంతరం లక్ష్మీనారాయణ రాష్ట్రంలో రైతులతో, యువకులతో మమేకం అయ్యేవారు. అందుకు అనుగుణం అనేక ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. ఆయనకు వ్యవసాయంపైనా కూడా ఆసక్తి ఉండేది. వ్యవసాయం చేయాలనే కోరికతో తూర్పుగోదావరి జిల్లా ధర్మవరం గ్రామంలో పొలం కౌలుకు తీసుకున్నారు. కౌలుకు తీసుకున్న పొలంలో వరిపంట సాగు చేశాడు. వరిపంట కోతకు వచ్చింది. కూలీలను పెట్టి కోతలు కోయించవచ్చు. కానీ వారితో పాటు లక్ష్మీనారాయణ కూడా వరికోతల్లో పాల్గొన్నారు.

image 1 compressed 12తన పొలంలో నాలుగు రకాల వరిని సేంద్రియ ఎరువులు వాడి, ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో సాగుచేశానని తెలిపారు. తానే స్వయంగా కొడవలి పట్టి వరికోతలు కోస్తున్న ఫోట్ ను సోషల్ మీడియా ద్వార పంచుకున్నారు. ఒక సీబీఐలో కీలక అధికారిగా పనిచేసిన వ్యక్తి సామాన్య రైతులగా మారి వ్యవసాయం చేయండం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పలువురు ఆయనను ప్రశంసించారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.