సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో జగన్ సర్కార్ తీసుకొచ్చిన జీవో నం.1ను కూడా లక్ష్మీనారాయణ సమర్థించారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా ఆయన పేరు చెప్పుకుంటారు. ఎలాంటి కేసు అయినా.. వెనుక ఎంత పెద్ద మనుషులు ఉన్నా సరే ఏమాత్రం లెక్కచేయకుండా తన విధులు నిర్వహించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. పదవి విరమణ అనంతరం పలు సేవ కార్యక్రమలో, పలు సంస్థలు నిర్వహించే వ్యక్తిత్వ వికాస పోగ్రామ్స్ పాల్గొన్ని విద్యార్థులకు,యువకులకు మంచి సందేశాలు ఇస్తుంటారు. అలానే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ వ్యవహారాల గురించి తనదైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న జీవో నం.1ను లక్ష్మీనారాయణ సమర్ధించిన విషయం తెలిసిందే. తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మరి. ఎందుకు చెప్పారు? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
విశాఖపట్నం వేదికగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 శుక్రవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు ఈ సమ్మిట్ కు తరలి వచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న పరిస్థితులు, ప్రభుత్వం కల్పిస్తోన్న వసతులు, రాయితీలపై ప్రశంసలు కురిపించారు. రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, కరణ్ అదానీ, కుమారమంగళం బిర్లా, నటరాజన్ చంద్రశేఖరన్, సయంట్ అధినేత మోహన్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు.
ఎడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు కూడా ఈ సమ్మిట్ కు హాజరవుతున్నారు. అయితే ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 పై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ స్పందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్నికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు- 2023 విజయవంతం కావాలని కోరుకుంటునానని అన్నారు.
సమృద్ధి, శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలని, శిఖరాగ్ర సమావేశం ఫలితాలు పౌరుల ప్రత్యేకించి యువత ఆకాంక్షలను తీర్చాలన్నాని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇందులో సీఎం జగన్, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్విటర్ ఖాతాలను జోడించారు. జేడీ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. “మీరు చాలా గ్రేట్ సార్” అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ట్వీట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్, 2023 విశాఖపట్నంలో గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సమృద్ధి , శ్రేయస్సుకు అనుగుణంగా ఉండాలి మరియు శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాలు పౌరుల ప్రత్యేకించి యువత ఆకాంక్షలను తీర్చాలి. @ysjagan @gudivadaamar #AdvantageAP
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) March 3, 2023