సంక్షేమ పథకాల అమలు, రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలు చూసి ఇప్పటికే పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జనగ్ మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తుండగా.. తాజాగా ఆ జాబితాలోకి మరో ప్రముఖుడు చేరారు. సీఎం జగన్‌పై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు కురిపించారు. ఆయన తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రులు, రాజకీయ నేతలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తూ.. సీఎం జగన్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌పై ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు.
ఈ సందర్భంగా జేడీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం పేరుతో ప్రజల్లోకి వచ్చి.. వారిని చైతన్యపరిచి.. దేశవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చారు. అలానే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌లో ఒక గొప్ప లక్షణం ఉంది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుని.. సాధించాలని భావిస్తే.. దాని కోసం ఎంతలా కష్టపడాలో.. ఎంత తీవ్రంగా కృషి చేయాలో ఆయన్ను చూసి నేర్చుకోవచ్చు. జగన్ తాను అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం 10 ఏళ్లు ప్రజల్లో ఉన్నారు.. పాదయాత్ర చేశారు. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని.. దాని కోసం మనం ఎలా శ్రమించాలో.. జగన్‌ని చూసి నేర్చుకోవచ్చు. ఒక లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా వెళ్లడంలో ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చు’’ అంటూ ప్రశంసలు కురిపించారు..
అలానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఆయన ప్రజల పల్స్ తెలిసిన నాయకుడని ప్రశంసించారు. పేద, బడుగు, బలహీన వర్గాల వారి కోసం ఆలోచించి.. ఆరోగ్య శ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి గొప్ప పథకాలు తీసుకొచ్చారని.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన తీసుకొచ్చిన పథకాలు అమలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అలానే తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
వైఎస్సార్, జగన్‌ల గురించి లక్ష్మీనారాయణ మాట్లాడిన ఈవీడియోను వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ.. వైరల్ చేస్తున్నారు.. పట్టుదల విషయంలో జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ ఈ వీడియోను ప్రస్తావిస్తున్నారు. ధృడ సంకల్పానికి మారుపేరు జగన్ అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
దృడసంకల్పానికి మారుపేరు జగన్
– ex JD లక్ష్మీనారాయణ pic.twitter.com/jYOpcWNkV2— Satyanarayana bhogi (@satyam_bhogi) October 31, 2022
లక్ష్య చేదన కోసం వై.ఎస్ జగన్ గారిలో ఉన్న పట్టుదల ఎవరైనా ఆదర్శంగా తీసుకోవచ్చు : జెడి లక్ష్మీనారాయణ#YSJagan pic.twitter.com/Agx3ROpj9q
— Vizag – The City Of Destiny (@Justice_4Vizag) October 30, 2022