రుయా ఆసుప‌త్రి ఘ‌ట‌న‌పై స్పందించిన మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ!

Vidadal rajini react on ambulance services

ఆంధ్రప్రదేశ్‌ తిరుపతి రుయా ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది సంగతి తెలిసిందే. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలుడు మృతి చెందాడు. అడిగినంత డబ్బులు ఇవ్వలేదని అక్కడి అబులెన్స్ సిబ్బంది ఎవరు రాలేదు. దీంతో ఆ బాలుడి తండ్రి మృతదేహాన్ని బైక్ ఇంటికి తీసుకెళ్లాడు. ఈఘటన అందరిని కలచివేసింది. అక్కడి అబులెన్స్ సిబ్బంది సాగించిన దందాపై వెైద్య,ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ స్పందించారు.

ఈ తిరుపతి రుయాలో జరిగిన ఘటనకు కార‌ణ‌మైన వారిని వ‌దిలిపెట్టే ప్రసక్తే లేద‌ని, దోషుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని మంత్రి తెలిపారు. మంత్రి రజనీ మీడియాతో మాట్లాడుతూ..” ఈ ఘటనపై రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భారతిని వివరణ కోరాం. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేటు అంబులెన్స్ లను నియంత్రిస్తాం. ఈ ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దోషులను కఠినంగా శిక్షిస్తాం. మృతుడి కుటుంబ స‌భ్యులు, వారికి సాయం వచ్చిన మరో అంబులెన్స్ డ్రైవ‌ర్‌ను ఎవ‌రు బెదిరించార‌న్న దానిపై లోతుగా ద‌ర్యాప్తు చేస్తాం. ఇక‌పై మ‌హాప్రస్థానం వాహ‌నాల్లో ఉచితంగానే మృత‌దేహాలను త‌ర‌లిస్తాం. మ‌హాప్రస్థానం అంబులెన్స్‌లు నితంత‌రం ప‌నిచేసేలా త్వర‌లో విధానం తీసుకొస్తాం” అని మంత్రి రజనీ పేర్కొన్నారు. మరి.. ఈవిషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

2 Atrocities in Tirupati min 1

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.