ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు చదువుకునే వయసులో ప్రేమా, గీమా అంటూ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నారు. ఇంతటితో ఆగక తెలిసి తెలియని వయసులో ప్రేమ పేరుతో జల్సాలు చేస్తూ చివరికి ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. ఇటీవల ఓ మైనర్ బాలిక ప్రియుడి మోజులో పడి ఏకంగా కన్న తండ్రిని కత్తి పొడిచింది. ఇదిలా ఉంటే తాజాగా 9వ తరగతి బాలిక హాస్టల్ లో చదువుకుంటూ మగబిడ్డకు జన్మనిచ్చింది. వినటానికొ షాకింగ్ గా ఉన్న ఇది నిజం. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వరదయ్యపాలెంకు చెందిన ఓ 14 ఏళ్ల బాలిక వాల్మీకిపురంలోని ఓ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటుంది. అయితే సంక్రాంతి పండగ నేపథ్యంతోనే ఆ బాలిక ఇంటికి వచ్చి మళ్లీ హాస్టల్ కు వెళ్లింది. ఇదిలా ఉంటే గత కొన్ని నెలల నుంచి ఆ బాలికకు నెలసరి జరగడం లేదు. దీనిపై స్పందించిన పాఠశాల సిబ్బంది ఆ బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు అనేక టెస్టులు చేయించామని చెబుతూ వచ్చారు. అయితే తాజాగా మాత్రం ఆ బాలికకు కడపులో నొప్పిగా ఉందని చెప్పడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లాక ఆ మైనర్ బాలిక బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఇది విన్న వాళ్లు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే స్పందించిన హాస్టల్ ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఈ ఘటనపై స్పందించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలికను తల్లి చేసింది ఎవరనే దానిపై లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇదే విషయంపై స్పందించిన జిల్లా కలెక్టర్ హాస్టల్ సిబ్బంది, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.